Natural Star Nani: ఆ హీరోయిన్ అంటే నానికి చాలా ఇష్టమట.. ఇప్పటికీ అది కలలానే ఉందంటూ..
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ స్టార్ గా ఎదిగాడు నాని. తాజాగా నాని దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు నేచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారారు నాని. అష్టాచమ్మా సినిమాతో నాని హీరోగా పరిచయం అయ్యారు. ఆతర్వాత హీరోగా పాపులర్ అయ్యాడు నాని. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ స్టార్ గా ఎదిగాడు నాని. తాజాగా నాని దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ గా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో నాని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. దసరా సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నాడు నాని.
అలాగే తన ఫెవరెట్ హీరోయిన్ గురించి తెలిపాడు నాని. తనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమట. అతిలోక సుందరి శ్రీదేవి అంటే చాలా ఇష్టమన్నారు నాని. రామ్ గోపాల్ వర్మ మూవీ క్షణ క్షణం లో శ్రీదేవిని చూడటం తనకు ఇప్పటికీ కలగానే అనిపిస్తుందని అన్నారు నాని.Sridevi