Mahesh Babu: మహేష్ బాబు సినిమాల్లో నమ్రతకు ఆ మూవీ అస్సలు నచ్చదట..
ఓ వైపు ఫ్యామిలీని చూసుకుంటూ మరో వైపు బిజినెస్ లు చూసుకుంటున్నారు నమ్రత. ఇదిలా ఉంటే ఈ మధ్య ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో రాణిస్తున్న మహేష్ నమ్రతను లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి వంశీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ నమ్రత ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఓ వైపు ఫ్యామిలీని చూసుకుంటూ మరో వైపు బిజినెస్ లు చూసుకుంటున్నారు నమ్రత. ఇదిలా ఉంటే ఈ మధ్య ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మళ్లీ సినిమాల్లో నటిస్తారా..? మహేష్ సినిమాలో చిన్న పాత్ర చేస్తారా.? అని ప్రశ్నిస్తే చేయను అని సమాధానం ఇచ్చారు.
అలాగే మహేష్ సినిమాలో మీకు నచ్చని సినిమా ఏంటి అని ప్రశ్నిస్తే.. సైనికుడు సినిమా ఆమెకు అస్సలు నచ్చదట. సైనికుడు సినిమాను గుణశేఖర్ తెరకెక్కించారు. స్టూడెంట్స్ రాజకీయాల్లోకి రావాలి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇక ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాతర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు మహేష్.