Shobhan Babu: సోగ్గాడి ఇంట్లో దేవుడి స్థానంలో ఆ హీరో ఫోటో.. శోభన్ బాబు ఆరాధించిన ఏకైక వ్యక్తి అతడే..
ఇప్పటివరకు ప్రేక్షకుల హృదయాలను దొచుకున్న హీరోలలో మొట్ట మొదటి నటుడు ఆయనే కావడం విశేషం. అలాగే ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మర్చిపోని అందాల సోగ్గాడు కూడా ఆయనే. హీరోగా క్రేజ్ ముగిసిన తర్వాత ఆయన వద్దకు అనేక చిత్రాల అవకాశాలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు తనను హీరోగానే గుర్తుపెట్టుకోవాలని అనేక పాత్రలను రిజెక్ట్ చేశారు. తన సినీ ప్రయాణం హీరోగానే ముగిసిపోవాలని అనుకున్నారట. అందుకే ఎన్నో చిత్రాల అవకాశాలు వచ్చినా సున్నితంగా వాటిని రిజెక్ట్ చేశారట.
ఆంధ్రుల అందాల నటుడు.. ఎంతో మంది అభిమానుల హృదాయాలు దొచేసిన సోగ్గాడు. ఈ పేర్లు చెబితే గుర్తుకువచ్చే అలనాటి హీరో శోభన్ బాబు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. వైవిధ్యమైన కుటుంబకథా చిత్రాలతో జనాలను అలరించి తన చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టారు. వెండితెరపై సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకుని చివరివరకు హీరోగానే అలరించాడు. ఇప్పటివరకు ప్రేక్షకుల హృదయాలను దొచుకున్న హీరోలలో మొట్ట మొదటి నటుడు ఆయనే కావడం విశేషం. అలాగే ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మర్చిపోని అందాల సోగ్గాడు కూడా ఆయనే. హీరోగా క్రేజ్ ముగిసిన తర్వాత ఆయన వద్దకు అనేక చిత్రాల అవకాశాలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు తనను హీరోగానే గుర్తుపెట్టుకోవాలని అనేక పాత్రలను రిజెక్ట్ చేశారు. తన సినీ ప్రయాణం హీరోగానే ముగిసిపోవాలని అనుకున్నారట. అందుకే ఎన్నో చిత్రాల అవకాశాలు వచ్చినా సున్నితంగా వాటిని రిజెక్ట్ చేశారట.
అలాగే శోభన్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీలో శోభన్ బాబుకు ఓ హీరో అంటే అమితమైన గౌరవం ఉండేదట. ఆయన ఎక్కువగా ఆరాధించే నటుడి ఫోటోను తన ఇంట్లో దేవుడి చిత్రపటాలు ఉండే స్థానంలో పెట్టారట. సోగ్గాడు ఆరాధించే ఏకైక వ్యక్తి సీనియర్ హీరో ఎన్టీఆర్. ఈ విషయాన్ని గతంలో దివంగత నటుడు కృష్ణం రాజు తెలిపారు. వీరిద్దరు ప్రాణ స్నేహితులు. అప్పట్లో వీరు కలిసి పలు చిత్రాల్లో నటించారు. అలాగే శోభన్ బాబు పుట్టినరోజున ఉదయాన్నే ఆయనకు కృష్ణంరాజు ఫోన్ చేసి విష్ చేసేవారట. కృష్ణంరాజు తండ్రి బర్త్ డే.. శోభన్ బాబు పుట్టినరోజు ఒకేరోజు కావడంతో కృష్ణంరాజుకు గుర్తుండేదని అప్పట్లో తెలిపారు.
అలాగే ఓరోజు కొడంబాకంలోని శోభన్ బాబు ఇంటికి వెళ్లినప్పుడు హాల్లో నుంచి చూస్తే ఎన్టీఆర్ ఫోటో కనిపించదని.. ఇంట్లో ఓ దేవుడి ఫోటో పెట్టుకున్నట్లుగా రామారావు ఫోటో పెట్టుకున్నారని.. తారకరామారావు అంటే శోభన్ బాబుకు చాలా అభిమానం, ప్రేమ అని గతంలో తెలిపారు కృష్ణంరాజు. అంతేకాకుండా అన్నమయ్య, అతడు, బ్లాక్ రీమేక్, సుస్వాగతం ఇలా అనేక చిత్రాలను శోభన్ బాబు రిజెక్ట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.