Suhasini Manirathnam: ’16 ఏళ్ల అమ్మాయిలగా ఉన్నావ్’.. నెటిజన్ ట్వీట్ సుహాసినీ రిప్లై వేరేలెవల్..

సుహాసిని పట్టుచీరలో ఉన్న ఫోటోస్ ట్విట్టర్ ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు. అయితే ఆ ఫోటోస్ కు నెటిజన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది

Suhasini Manirathnam: '16 ఏళ్ల అమ్మాయిలగా ఉన్నావ్'.. నెటిజన్ ట్వీట్ సుహాసినీ రిప్లై వేరేలెవల్..
Suhasini 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 14, 2022 | 1:34 PM

సోషల్ మీడియా ప్రపంచంలో సెలబ్రెటీల పోస్టలకు ఫాలోవర్స్ ఇచ్చే కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోహీరోయిన్లు చేసిన ట్వీట్స్, పోస్టులకు కామెంట్స్ చేయడమే కాకుండా.. కొన్ని సందర్భాల్లో దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. అయితే సెలబ్రెటీలు ఎక్కువగా తమకు వచ్చే కామెంట్లను పట్టించుకోరు. కేవలం శ్రుతిమించి జరిగే ట్రోల్స్ పై మాత్రమే రియాక్ట్ అవుతుంటారు.

అలాగే మరికొన్ని సందర్భాల్లో ఫన్నీగా రిప్లై ఇచ్చేస్తుంటారు. తాజాగా సీనియర్ హీరోయిన్ సుహాసినీ (Suhasini Manirathnam) సైతం ఓ నెటిజన్ కామెంట్‏కు ఫన్నీ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ మోడ్రన్ లవ్ వెబ్ సిరీస్‏లో నటించారు.

ఇవి కూడా చదవండి
Suhasini

Suhasini

తాజాగా సుహాసిని పట్టుచీరలో ఉన్న ఫోటోస్ ట్విట్టర్ ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు. అయితే ఆ ఫోటోస్ కు నెటిజన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో ఓ నెటిజన్ వావ్.. సో బ్యూటీఫుల్ మేడమ్. ఇప్పటికీ 16 ఏళ్ల అమ్మాయిగా ఉన్నారు. లవ్ యూ మేడమ్. అంటూ కామెంట్ ఇచ్చాడు. దానికి సుహాసినీ హ..హ అంటూ నవ్వేస్తూ.. జస్ట్ ఆ నంబర్ ను రివర్స్ చేస్తే అదే నిజం అంటూ రిప్లై ఇచ్చారు. ఆమె వయసు 61 అని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఆమె ఇచ్చిన కామెంట్ సూపర్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు ఫాలోవర్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.