Tollywood : చిరంజీవిని తిట్టా అని 50 మంది చుట్టుముట్టారు.. సీనియర్ హీరోయిన్..
తెలుగు సినిమా ప్రపంచంలో మెగాస్టార్ చిరంజీవికి ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో రారాజుగా వెలిగిపోతున్నారు. ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి పండక్కి మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో సందడి చేయనున్నారు.

మెగాస్టా్ర్ చిరంజీవి కెరీర్ మలుపు తిప్పిన సినిమాల్లో హిట్లర్ ఒకటి. అప్పట్లో వరుస ప్లాపులతో సతమతమవుతున్న చిరుకు.. ఈ సినిమా బూస్ట్ ఇచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో చిరుకు చెల్లిగా నటించి ప్రశంసలు అందుకుంది నటి మీనాకుమారి. ఆ హిట్లర్ సినిమాతోపాటు పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మీనా కుమారి మాట్లాడుతూ.. చిన్నతనంలో ఛార్టెడ్ అకౌంటెంట్ కావాలనేది తన ఆశయమని, తన కుటుంబంలో చదువుకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని ఆమె తెలిపారు. ఆమె తొలి చిత్రం తమిళంలో విజయకాంత్ సరసన కరుప్పు నిలా. ఆ సినిమా సమయంలో తన వయసు 18 సంవత్సరాలని తెలిపింది.
సినీ నేపథ్యం లేని తమ కుటుంబంలో, ముందుగా తన మేనత్త కుమార్తెలు సినీ రంగంలోకి ప్రవేశించారని, వారిలో ఒకరు నటిగా, మరొకరు సినిమాటోగ్రాఫర్ విజయశ్రీగా అడుగుపెట్టారని ఆమె గుర్తు చేసుకున్నారు. వారి ప్రోత్సాహంతోనే తాను మద్రాసుకు వచ్చి, చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించానని తెలిపారు. తమిళ చిత్రం కరుప్పు నిలాలో విజయకాంత్ సరసన నటించే అవకాశం వచ్చిందని, అప్పటికి తమిళం కూడా రాదని ఆమె చెప్పారు. తన మొదటి రోజు షూటింగ్‌లోనే విజయకాంత్‌తో కలిసి 15 రోజుల పాటు ఒక ఫైట్ సన్నివేశంలో నటించాల్సి వచ్చిందని, అది తనను ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోదామా అనిపించేలా చేసిందని వివరించారు. ఆ ఫైట్ సన్నివేశంలో రోప్ షాట్ చిత్రీకరిస్తుండగా, రోప్ తెగిపోయి విజయకాంత్, తాను కింద పడిపోయామని, వెన్నెముకకు గాయమైందని వెల్లడించారు. అప్పుడు భయంతో నొప్పిని కూడా చెప్పలేకపోయానని, మరుసటి రోజు మళ్లీ షూటింగ్‌కు వచ్చానని చెప్పారు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
అలాగే హిట్లర్ సినిమాలో చిరుకు చెల్లిగా కనిపించింది మీనాకుమారి. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన పరిస్థితులను వెల్లడించింది. హిట్లర్ సినిమాలో తాను చిరంజీవిని ఓ సందర్భంలో రాక్షసుడా నిన్ను చూస్తే భయంగా ఉంది అనే డైలాగ్ చెప్పాల్సి ఉంటుందని.. అది చూసి మెగా అభిమానులు హర్ట్ అయ్యారని చెప్పుకొచ్చింది. తాము ఓ రోజు కారులో ఒంగోలు వెళ్తుండగా ఓ 50 మంది చిరు అభిమానులు తన కారును చుట్టిముట్టి గొడవ చేశారని తెలిపింది. అందరం కారు దిగి అది సినిమా షూటింగ్ మాత్రమే అని చెప్పడంతో వారంతా వెళ్లిపోయారని గుర్తు చేసుకుంది.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
