Suman: తెలుగు చిత్రపరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్.. క్రమశిక్షణ లేదంటూ..
దాసరి నారాయణ రావు వర్ధంతి సందర్భంగా భారత్ ఆర్ట్స్ అకాడమీ, వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్తంగా ఫిల్మ్ ఛాంబర్లో దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం చేశాయి..
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదన్నారు సీనియర్ నటుడు సుమన్ (Suman). దాసరి నారాయణ రావు వర్ధంతి సందర్భంగా భారత్ ఆర్ట్స్ అకాడమీ, వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్తంగా ఫిల్మ్ ఛాంబర్లో దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం చేశాయి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో క్రమశిక్షణం.. ఆరోగ్యకరమైన వాతావరణం లేదన్నారు.. సినిమాలను కొనే బయ్యర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
సుమన్ మాట్లాడుతూ.. దాసరి నారాయణ రావు గారు ఇండస్ట్రీ పెద్దగా అందరి సమస్యల గురించి ఆలోచించే వారు.. ముఖ్యంగా ఆయన బయ్యర్స్ గురించి ఆలోచించేవారు..సినిమా ప్లాప్ అయిన తర్వాత సినిమాను ఫ్రీగా చేసి బయ్యర్స్ ను కాపాడేవారు. కానీ ప్రస్తుతం నిర్మాతలు బయ్యర్స్ గురించి ఆలోచించడం లేదు.. మేకర్స్ తీరుతో బయ్యర్స్ చాలా నష్టపోతున్నారు. కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. హిట్ అవుతుందనే నమ్మకంతో బయ్యర్స్ కొంటున్నారు. ఒకవేళ ఆ సినిమా ప్లాప్ అయితే నష్టపోయేది బయర్స్ మాత్రమే. అలాగే సినిమా షూటింగ్ లో సమయపాలన లేదు.. అదనపు భారం నిర్మాతలకు కలిగిస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ తరహాలో తెలుగు సినీ పరిశ్రమలోని నిబంధనలను సవరించాలన్నారు..