N. T. Rama Rao: అందుకే ఆయనను యుగపురుషుడు అనేది.. అప్పట్లో ఎన్టీఆర్ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్..
సీనియర్ ఎన్టీఆర్ పంక్చువాలిటీలో.. డిసిప్లిన్‌లో ఎంత స్ట్రిక్టో అందరికీ తెలిసిందే..! అందులోనూ.. హిందూ ధర్మాలను తూచా తప్పకుండా పాటించే ఆయన వైఖరి కూడా అప్పట్లో అందరికీ తెలిసిందే..!

సీనియర్ ఎన్టీఆర్(N. T. Rama Rao) పంక్చువాలిటీలో.. డిసిప్లిన్‌లో ఎంత స్ట్రిక్టో అందరికీ తెలిసిందే..! అందులోనూ.. హిందూ ధర్మాలను తూచా తప్పకుండా పాటించే ఆయన వైఖరి కూడా అప్పట్లో అందరికీ తెలిసిందే..! అయితే ఇప్పుడు ఇదే వైఖరి.. నేటి జనరేషన్‌కు కూడా తెలిసేలా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అప్పట్లో చేసిన ఓ పని ఇప్పుడు మరోసారి ఆయన్ని చేతులెత్తి మొక్కేలా చేస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకు ఆ వీడియోలో ఏమున్నదంటే. అప్పట్లో ఓ పెళ్లికి సీనియర్ ఎన్టీఆర్ అతిథిగా హాజరయ్యారు.. అయితే ఆ పెళ్ళిజరిపించాలిన్స పురోహితుడి ఆలస్యంతో.. ముహూర్తం టైం దాటిపోతుండడంతో.. తనే పురోహితుడిగా మారారట. మారడమే కాదు.. ఆ పెళ్లి క్రతువును అచ్చం పురోహితుడిలాగే.. శాస్త్రోక్తంగా.. మంత్రోఛ్చారణతో.. చాలా ఓపికగా.. నిర్శహించారట. మధ్య మధ్యలో ఆ మంత్రాలకు అర్థాలు కూడా చెబుతూ.. పెళ్లి కొడుకుకు.. పెళ్లి కూతురును ఎలా చూసుకోవాలో వివరించారట ఎన్టీఆర్.
ఇలా ఎన్టీఆర్ పెళ్లి చేయడం చూసి.. అక్కడున్న వారు ఆ దేవుడే మీ పెళ్లి చేశారంటూ.. ఆ జంటకు ఆశ్వీరదించారట.. వారి అదృష్టాన్ని చూసి మరి కొంత మంది కుళ్లుకున్నారట కూడా..! ఇక అప్పట్లో మీడియా కవరేజ్ అంతగా లేకపోవడంతో.. ఈ న్యూస్ ఎక్కువగా బయటికి రాలేదు. కాని ఇదే విషాయాన్ని లైఫ్ కోచ్ గా పాపులర్ అయిన ప్రియాంక చౌదరి తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పారు. ఈ వీడియోతో నెట్టింట వైరల్ అవుతున్నారు.

Sr Ntr



