T. Rama Rao: టాలీవుడ్‌లో విషాదం.. అనారోగ్యంతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత
టాలీవుడ్ లో విషాదం నెలకొంది.. ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీ దిగ్బంతికి గురైంది.
టాలీవుడ్ లో విషాదం నెలకొంది.. ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు(T. Rama Rao) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీ దిగ్బంతికి గురైంది. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాతినేని రామారావు తుది శ్వస విడిచారు. తాతినేని రామారావు గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1966 నుంచి సినీ రంగానికి సేవలందించిన రామారావు దాదాపు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాతినేని తన సినీ ప్రస్థానాన్ని 1950 లలో సహాయ దర్శకునిగా తన కజిన్ అయిన టి.ప్రకాశరావు, కోటయ్య ప్రత్యాగాత్మ వారి వద్ద ప్రారంభించారు. తెలుగులో 1966 లో నవరాత్రి చిత్రంతో దర్శకునిగా ప్రారంభించారు.
తెలుగుతోపాటు హిందీలోనూ సినిమాలు చేశారు తాతినేని తెలుగు, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్.టి.రామారావు నటించిన యమగోల చిత్రానికి ఈయనే దర్శకుడు. రామారావు 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించారు. తాతినేని రామారావు మరణ వార్త తెలుసుకొని పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :