Kannappa Movie: శివపార్వతులుగా ప్రభాస్, నయనతార.. లీక్ చేసిన అలనాటి హీరోయిన్ మధుబాల..
భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ కీలకపాత్రలో నటించనుంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. హిందీలో మహాభారత్ రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభిస్తున్నట్లుగా హీరో మంచు విష్ణు. ఈ విషయాన్ని తెలియజేస్తూ న్యూజిలాండ్‌లో అందమైన లొకేషన్స్ లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుందని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప ఇటీవల శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ కీలకపాత్రలో నటించనుంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. హిందీలో మహాభారత్ రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభిస్తున్నట్లుగా హీరో మంచు విష్ణు. ఈ విషయాన్ని తెలియజేస్తూ న్యూజిలాండ్‌లో అందమైన లొకేషన్స్ లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుందని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ సినిమాను ప్రారంభిస్తున్నప్పుడు జీవితంలో పొందని అనుభూతిని పొందానని.. ఆ శివపార్వతుల ఆశీస్సులతో ఏడేళ్ల నా శ్రమ, కల నిజం కాబోతుందని అన్నారు మంచు విష్ణు.
ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ గత ఎనిమిది నెలలుగా ఎంతో కష్టాన్ని చూశారని.. నిద్రలేని రాత్రులు గడిపారని.. పండగలు, పబ్బాలు అన్ని మర్చిపోయి.. రోజుకు ఐదు గంటల నిద్రనే ఎంతో విలాసవంతమైన భోగంగా భావించారని చెప్పుకొచ్చారు. దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శివుడిగా కనిపించనున్నారని.. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార పార్వతి పాత్రలో నటించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే ప్రభాస్ పాత్ర గురించి సోషల్ మీడియాలో రూమర్స్ నడుస్తుండగా.. హర హర మహదేవ్ అంటూ కామెంట్ చేశాడు మంచు విష్ణు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ కన్ఫామ్ అనే టాక్ నడిచించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి అలనాటి హీరోయిన్ మధుబాల మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
EPIC ADVENTURE BEGINS
Today, I stand in awe as the adventure of a lifetime unfolds in the picturesque landscapes of New Zealand, as we commence the shooting of ‘Kannappa.’ This dream has been seven years in the making, and its realization is a testament to the divine blessings… pic.twitter.com/tVotX1RIJr
— Vishnu Manchu (@iVishnuManchu) September 25, 2023
సీనియర్ హీరోయిన్ మధుబాల ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్, నయనతార శివపార్వతులుగా కనిపించనున్నారని.. అందులో మోహన్ బాబు తనయుడు మెయిన్ లీడ్ అనుకుంటా అంటూ మధుబాల చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమా పేరు గానీ ఎక్కడా చెప్పలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. కన్నప్ప సినిమాలో వీరిద్దరు నటించడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. దీంతో భక్త కన్నప్ప సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. దాదాపు 16 ఏళ్ల తర్వాత వీరిద్దరి జోడి మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది.
View this post on Instagram
భక్త కన్నప్ప సినిమా కోసం మొత్తం 600 మంది సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగబోతున్నారు. అలాగే ఈ మూవీకి కథలోకి ప్రతిభావంతులైన పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయినాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి అందరూ కలిసి స్క్రిప్ట్ ను మరింత అద్భుతంగా మలిచారని.. ఎంతో మంది త్యాగాలు చేస్తే ఈ కన్నప్ప నేడు ఇక్కడి వరకు వచ్చిందని అన్నారు.