Madhubala: అయ్యో పాపం.. నాటి హీరోయిన్స్‌కు అన్ని కష్టాలా..! అసలు విషయం చెప్పిన మధుబాల
ఇప్పుడు సినిమా హీరోయిన్స్ కు భారీ రెమ్యునరేషన్స్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలు కలిపిస్తున్నారు మేకర్స్. హీరోయిన్స్ కు పెద్ద పెద్ద హోటళ్లు , ఏసీ రూమ్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే హీరోయిన్స్ కోసం ప్రత్యేక కారవాన్‌ను ఏర్పాటు చేశారు. కారవాన్‌లో అని సౌకర్యాలు చేస్తున్నారు.

ఇప్పుడు సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. హీరోయిన్స్ కు షూటింగ్ సెట్ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు సినిమా హీరోయిన్స్ కు భారీ రెమ్యునరేషన్స్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు మేకర్స్. హీరోయిన్స్ కు పెద్ద పెద్ద హోటళ్లు, ఏసీ రూమ్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే హీరోయిన్స్ కోసం ప్రత్యేక కారవాన్‌ను ఏర్పాటు చేశారు. కారవాన్‌లో అని సౌకర్యాలు చేస్తున్నారు. అచ్చం ఇంట్లో ఉన్నట్టే ఉండేలా ఆ కారవాన్‌లు ఉంటాయి. అయితే ఒకప్పుడు హీరోయిన్స్ ఎన్నో అవస్థలు పడేవారు. సరైన సౌకర్యాలు ఉండేవి కాదు. తాజాగా ఇదే విషయం పై సీనియర్ హీరోయిన్ మధుబాల ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మధుబాల ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. మధుబాల ‘రోజా’ చిత్రంలో అద్భుత నటనకు ప్రశంసలు అందుకున్నారు. జాతీయ అవార్డ్ కూడా అందుకున్నారు మధుబాల. అలాగే తన అందంతో కవ్వించి ఎంతోమందిని తన ప్రేమలో పడేలా చేశారు మధుబాల. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ‘రోజా’, ‘జెంటిల్‌మన్’ సినిమాలతో పాటు రజనీకాంత్, కమల్‌హాసన్‌లతో కలిసి నటించి మెప్పించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్.. అమ్మ, వదిన, అక్క పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా మధుబాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఆమె మాట్లాడుతూ.. 90ల నాటి హీరోయిన్లకు ప్రైవసీ అంటూ ఏమీ ఉండేది కాదు అని అన్నారు మధుబాల. కనీస సౌకర్యమైన టాయిలెట్స్ కూడా ఉండేవి కావు. ఔట్ డోర్ షూటింగుల సమయంలో నటీమణులకు చాలా కష్టంగా ఉండేది. ఒకసారి మేం కొండల్లో ఓ పాట షూట్ చేస్తున్నాం. టాయిలెట్స్ లేవు, ఎలాంటి ఏర్పాట్లు లేవు. నాతో సహా చాలా మంది మహిళలు ఉన్నారు అని మధుబాల తెలిపారు. డ్యాన్స్ చేయడానికి మాకు ఇచ్చిన బట్టలు చాలా బరువుగా ఉండేవి. అంత బరువైన బట్టలు వేసుకుని ఎండలో డ్యాన్స్ చేసేవాళ్ళం. పాట కోసం చాలా బట్టలు మార్చవలసి వచ్చేది. దానికి బట్టలు మార్చుకునే గది కూడా ఉండేది కాదు. ఆసమయంలో ఓపెన్‌లో బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది’ అని మధు షా అన్నారు. మణిరత్నం తెరకెక్కించిన‘ఇరువర్’ సినిమాలో నటిస్తున్నప్పుడు ఒకసారి భోజనం చేసి రాయి మీద పడుకున్నా అని తెలిపాడు. అప్పుడు కొందరు ‘చూడు ఎంత డబ్బు సంపాదించి ఏం లాభం, రాయి మీద పడుకుంది అని ఎవరో మాట్లాడుకోవడం నేను విన్నాను అని అన్నారు మధుబాల.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
