AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR Birthday: మ్యాన్ ఆఫ్ మాసెస్.. తారక్ కోసం తరలివచ్చిన 10 లక్షల మంది

థియేటర్ లో స్క్రీన్ పైన ఆయన కనిపిస్తే చాలు అభిమానులు ఈలలు గోలలతో హంగామా చేస్తారు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. ఆయన గురించి అందరికి తెలుసు. 8 ఏళ్ల వయసులో 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన జూనియర్ ఈరోజు గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. టాలీవుడ్ లో టాప్ హీరోగా రాణించిన ఎన్టీఆర్ 2022 లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్ ' చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

NTR Birthday: మ్యాన్ ఆఫ్ మాసెస్.. తారక్ కోసం తరలివచ్చిన 10 లక్షల మంది
Ntr
Rajeev Rayala
|

Updated on: May 20, 2024 | 12:55 PM

Share

జూనియర్ నందమూరి తారక రామారావు  పేరు చెబితేనే ప్రేక్షకులకు పూనకాలు. థియేటర్ లో స్క్రీన్ పైన ఆయన కనిపిస్తే చాలు అభిమానులు ఈలలు గోలలతో హంగామా చేస్తారు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. ఆయన గురించి అందరికి తెలుసు. 8 ఏళ్ల వయసులో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన జూనియర్ ఈరోజు గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. టాలీవుడ్ లో టాప్ హీరోగా రాణించిన ఎన్టీఆర్ 2022 లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్ ‘ చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఎన్టీఆర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్‌ని ప్రేక్షకులు పిలుస్తూ ఉన్నారు.

ఆయన సినిమా సంగీత కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. అభిమానుల కోసం ప్రత్యేక రైలును కూడా వదిలారు. నేడు (మే 20) జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆయన తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ పేరుతో రక్తదానం, అన్నదానం చేస్తున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. తారక్ రేంజ్ గురించి చెప్పాలి అంటే.. ఒక సంఘటనను గుర్తు చేసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ని చూసేందుకు లక్షలాది మంది తరలి వస్తారు. ఒకసారి ఎన్టీఆర్ ను చూసేందుకు లక్షలాది మంది వచ్చారు. అంతే కాదు ఆయన అభిమానుల కోసం ఏకంగా 10 ప్రత్యేక రైళ్లను రిజర్వ్ చేశారు.

ఇది 2004 జనవరి 1న జరిగిన సంఘటన.. జూనియర్ ఎన్టీఆర్ నటించినసినిమా ‘ఆంధ్రావాలా’. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. కానీ అప్పటిలో ఆడియో రిలీజ్ లు ఉండేవి. సినిమా సాంగ్స్ అన్ని అప్పుడే రిలీజ్ చేసేవారు. క్యాసెట్స్ రూపంలో ఆ సాంగ్స్ ను రిలీజ్ చేసేవారు. కాగా ఆంధ్రావాలా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజల కోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది.  జూనియర్. ఎన్టీఆర్ కోసం ఇంత మంది వస్తారని ఎవరికీ లేదు. పెద్ద సంఖ్యలో జనం తరలిరావడం ఆ కార్యక్రమానికి ప్రత్యేకత. కానీ తొక్కిసలాట జరగలేదు. అంతా ప్రశాంతంగా సాగింది.

ఆ ఆడియో లాంచ్ ఈవెంట్ అనుకున్న దానికంటే భారీగానే జరిగింది.. అప్పుడు ఎన్టీఆర్ ఫాలోయింగ్ ను చూసి అందరూ నోళ్లెబెట్టారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆతర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఎన్టీఆర్. తారక్ డాన్స్, డైలాగ్స్ కు యమా క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ‘దేవర’ సినిమా రూపొందుతోంది. ఇది పాన్ ఇండియా చిత్రం. ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదల కానుంది. హిందీయాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ‘వార్ 2’లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 14, 2025న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు