Annapurna: ఆ తప్పు చేశానని అందరూ కలిసి చెట్టుకు కట్టేశారు.. అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు..

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి అన్నపూర్ణ సుపరిచితురాలు. గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో 700లకు పైగా చిత్రాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అన్నపూర్ణ. ఎమోషనల్ పాత్రలతోపాటు...

Annapurna: ఆ తప్పు చేశానని అందరూ కలిసి చెట్టుకు కట్టేశారు.. అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు..
Annapurna
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 17, 2021 | 6:26 PM

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి అన్నపూర్ణ సుపరిచితురాలు. గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో 700లకు పైగా చిత్రాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అన్నపూర్ణ. ఎమోషనల్ పాత్రలతోపాటు… కామెడీలోనూ తనదైన ముద్ర వేశారు. తల్లిగా.. బామ్మగా ఎన్నో పాత్రలు చేసిన అన్నపూర్ణ ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో తన కూతురి మరణంతోపాటు.. తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చారు అన్నపూర్ణ.

జీవితంలో తాను ఎదుర్కోన్న వ్యక్తులు.. ఎదురైన సమస్యలతోపాటు.. తెలిసినవారు భూమి విషయంలో తన ఫోన్ నంబర్ బ్లాక్ చేశారని చెప్పుకొచ్చారు. ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా భూమి కొని తప్పుచేశానని.. అదే విషయం గురించి ఇండస్ట్రీకి చెందిన కొందరిని పలుమార్లు సంప్రదించిన ఫలితం లేదని.. నాకు తెలియదంటూ చేతులు ఎత్తేశారని చెప్పుకొచ్చారు. అలా తన జీవితంలో జరిగిన ఘటనల గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు అన్నపూర్ణ. ఇండస్ట్రీలో అక్కడివి ఇక్కడా.. ఇక్కడివి అక్కడా చెబుతుంటారు కానీ నాకు అలాంటి అలవాటు లేదని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. అలా చెప్పకుండా ఉండటానికి చిన్నప్పుడు ఓ ఘటన జరిగిందని తెలిపారు. చిన్నతనంలో ట్యూషన్ కోసం వెళ్లే సమయంలో అక్కడ ఓ మాస్టారు ఉండేవారు. ఆ ఇంటి పక్కనే ఓ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఇవ్వమని ఉత్తరం నాకు ఇచ్చేవారు. నేను దాన్ని తీసుకెళ్లి ఆమెకు ఇచ్చేదాన్ని. అయితే ఓసారి వాళ్లింట్లో వాళ్లకి తెలిసింది. దీంతో అందరూ కలిసి నన్ను చెట్టుకు కట్టేశారు. మా అమ్మకు ఈ విషయం చెబితే కొట్టండి.. అలా కొడితేనే ఇంకోసారి ఇలాంటి పనులు చేయదు అని అన్నారు. ఆ ఘటనతో నాకు ఓ విషయం అర్థమైంది. ఎక్కడివి అక్కడే ఉంచాలి. అవతలి వారి విషయాల్లో కలగజేసుకోకూడదు.. ఎవరి గురించి పట్టించుకోకూడదు అని తెలిసింది. అందుకే నేను ఎవరి మాటలు వినను. ఎక్కడ విన్నవి అక్కడే మరచిపోతాను. లేదా అస్సలు వినను. ఒకవేళ ఎవరైనా అడిగితే తెలియదు అని చెప్పి తప్పుకుంటాను అని చెప్పుకొచ్చారు అన్నపూర్ణ.

Also Read: Gautam Benegal: మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు గౌతమ్ బెనెగల్ మృతి..

Narappa Movie: మరో మెలోడీతో ఆకట్టుకున్న మణిశర్మ.. నారప్ప నుంచి సెకండ్ సాంగ్..

Suresh Babu: గత అనుభవాలతోనే ఇలా.. వెంకటేష్ చాలా బాధపడ్డాడు..’నారప్ప’ రిలీజ్ పై సురేష్ బాబు ఆసక్తికర కామెంట్స్..