Aishwarya: టాలీవుడ్ నటికి లైంగిక వేధింపులు.. దారుణంగా మెసేజ్ చేస్తున్నారంటూ ..
గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. ప్రస్తుతం సోప్స్ బిజినెస్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఇటీవల తాను ఆన్ లైన్ లైంగిక వేధింపులకు గురయ్యానని అన్నారు. చాలా మందికి తనకు అసభ్యకరమైన సందేశాలు పంపుతుండడంతో డిప్రెషన్‌కు గురైనట్లు తెలిపారు.

తెలుగు ప్రేక్షకులకు నటి ఐశ్వర్య సుపరిచితమే. టాలీవుడ్.. కోలీవుడ్ ఇండస్ట్రీలలో పలు చిత్రాల్లో కీలకపాత్రలలో నటించారు. సీనియర్ నటి లక్ష్మి కూతురు అయిన ఐశ్వర్య తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అమ్మా నాన్న తమిళమ్మాయి, నాని, కళ్యాణ వైభోగం, ధైర్యం వంటి చిత్రాల్లో సహయ నటిగా కనిపించారు. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. ప్రస్తుతం సోప్స్ బిజినెస్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఇటీవల తాను ఆన్ లైన్ లైంగిక వేధింపులకు గురయ్యానని అన్నారు. చాలా మందికి తనకు అసభ్యకరమైన సందేశాలు పంపుతుండడంతో డిప్రెషన్‌కు గురైనట్లు తెలిపారు. కూతురి సలహాతోనే ఈ విషయాన్ని అందరి ముందుకు తీసుకువచ్చానని అన్నారు.
ఐశ్వర్య మాట్లాడుతూ.. “సోప్ బిజినెస్ కోసం సోషల్ మీడియాలో ఫోన్ నంబర్ షేర్ చేశాను. అప్పటి నుంచి అనుచిత సందేశాలు.. అసభ్యకరమైన ఫోటోస్ పంపిస్తున్నారు. కొంతమంది పురుషులు ప్రైవేట్ పార్ట్స్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు. దీంతో మానసికంగా డిస్టర్బ్ అయ్యాను” అంటూ తనకెదురైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియో షేర్ చేశారు ఐశ్వర్య.
ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ విషయంలో ఆమెకు చాలా మంది నెటిజన్స్ మద్దతుగా నిలిచారు. వందకు పైగా చిత్రాల్లో నటించారు ఐశ్వర్య. ప్రియదర్శన్ రచన దర్శకత్వం వహించిన యాక్షన్ క్రైమ్ డ్రామా గార్డిష్ మూవీతో హిందీలోకి అరంగేట్రం చేసింది. అడవిలో అభిమన్యుడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ఐశ్వర్య. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటించింది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
