Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు.. వీడియో వైరల్..
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు సినీనటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా వార్నర్ గురించి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వార్నర్ కు సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు రాజేంద్రప్రసాద్.

టాలీవుడ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ రాబిన్ హుడ్. డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మార్చి 23న హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ పై నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీంతో నటుడు రాజేంద్ర ప్రసాద్ పై సోషల్ మీడియాలో వార్నర్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు.
ఎంతో అనుభవం ఉన్న నటుడు స్టార్ క్రికెటర్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ఏకిపారేశారు. ఈ క్రమంలోనే వార్నర్ కు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు రాజేంద్ర ప్రసాద్. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతుంది. అందులో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికి నమస్కారం. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ పై అనుకోకుండా నోటి నుంచి మాట దొర్లింది. అది ఉద్దేశ్య పూర్వకంగా మాట్లాడింది కాదు. ఈవెంటే కంటే మందు అంతా కలిసే ఉన్నాం. ఎంతో సరదాగా గడిపాము. వార్నర్, నితిన్ నా పిల్లల్లాంటి వారు అని అన్నాను. ఐ లవ్ వార్నర్.. ఐ లవ్ క్రికెట్.” అంటూ చెప్పుకొచ్చారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..