AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murali Mohan: రైల్వే ట్రాక్ పక్కన ఆ నటుడి డెడ్ బాడీ చూసి గుండె తరుక్కుపోయింది..

సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారు మురళీమోహన్. 2014 లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుండి గెలిచారు. తన సోదరుడు కిశోర్‌తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా 25 చిత్రాలను నిర్మించారు మురళి మోహన్. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Murali Mohan: రైల్వే ట్రాక్ పక్కన ఆ నటుడి డెడ్ బాడీ చూసి గుండె తరుక్కుపోయింది..
Murali Mohan
Rajeev Rayala
|

Updated on: Jul 19, 2024 | 11:51 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ ను అందించిన నిర్మాత, నటుడు మురళీమోహన్. ఆయన బ్యానర్‌లో పలు సినిమాలు తెరకెక్కాయి. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారు మురళీమోహన్. 2014 లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుండి గెలిచారు. తన సోదరుడు కిశోర్‌తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా 25 చిత్రాలను నిర్మించారు మురళి మోహన్. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన సినిమా కెరీర్ లో జరిగిన రెండు షాకింగ్ విషయాలను పంచుకున్నారు.

ఇది కూడా చదవండి : నన్ను చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం

మురళి మోహన్ మాట్లాడుతూ.. సినిమా కెరీర్ లో రెండు సంఘటనలు తనను ఎక్కువగా బాధించాయి అని అన్నారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన బంగారక్క అనే సినిమా షూటింగ్ సమయంలో ఓ సంఘటన జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉండేది. షూటింగ్ సమయంలో ఓ చిన్న పాప మిస్ అయ్యింది. అయితే మేము షూటింగ్ కోసం తీసుకువచ్చిన పిల్లల లెక్క సరిపోయింది. కానీ ఇంకొక పాప ఉండాలంటూ పేరెంట్స్ వచ్చి అడిగారు. అప్పుడు మేము ఓ చెరువు దగ్గర షూట్ చేస్తున్నాం..వెంటనే ఆ చెరువంతా గాలిస్తే ఆ పాప డెడ్ బాడీ దొరికింది. అయితే ఆమె షూటింగ్ కోసం వచ్చిన పాప కాదు. మరొక పాపతో కలిసి షూటింగ్ చూద్దామని వచ్చింది. ఆ సంఘటన నన్ను చాలా బాధించింది అన్నారు.

ఇదికూడా చదవండి : Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

ఆలాగే అద్దాల మేడ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ సినిమాలో మాతోపాటు నటుడు కేవీ చలం కూడా షూటింగ్ చేస్తున్నారు. అయితే ఆ రోజు ఆయన షూటింగ్ కు రాలేదు. ఏమైంది ఎందుకు రాలేదు అని కనుక్కోవడానికి ఆయన ఇంటికి ఫోన్ చేశాం.. కానీ ఆయన షూటింగ్ కోసమే వచ్చారు అని ఇంట్లో వాళ్లు చెప్పారు. ఆయన ఎందుకు రాలేదు అని మేమంతా అనుకుంటుంటే.. ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి రైల్వే ట్రాక్ దగ్గర ఓ డెడ్ బాడీ ఉంది అని చెప్పాడు. ఎవరు అని అడిగితే ఎవరో గూర్ఖాలా ఉన్నాడు అని చెప్పాడు. వెంటనే చలం ఇంటికి ఫోన్ చేసి ఆయన ఏ కలర్ డ్రస్ వేసుకున్నాడు అని అడిగితే ఖాకీ బట్టలు అని చెప్పారు. దాంతో అందరం అక్కడికి వెళ్లి చూశాం అది ఆయనే.. ఆ సంఘటన చూసి చాలా బాధపడ్డాను. ఆ తర్వాత అందరం కలిసి ఆయన అంత్యక్రియలు ఘనంగా జరిపించాం అని తెలిపారు మురళి మోహన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.