Babu Mohan: ఆవేశం తగ్గించండి.. ప్రతి సభ్యుడికి విష్ణు అధ్యక్షుడే.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు..
మా ఎలక్షన్స్ ఇప్పటికీ హీట్ పెరుగుతుంది. ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా.. మా ఎన్నికల కుంపటి మాత్రం ఆరడం లేదు.
మా ఎలక్షన్స్ ఇప్పటికీ హీట్ పెరుగుతుంది. ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా.. మా ఎన్నికల కుంపటి మాత్రం ఆరడం లేదు. రోజూకో ట్విస్ట్ తెరపైకీ వస్తుంది. మా ఎన్నికలు..సిని’మా’ను చీల్చే పరిస్థితికి చేరాయి… వర్గాలుగా విడిపోయి.. విమర్శించుకుంటారు.. ఇక మా ఎన్నికల రోజున జరిగిన రచ్చ గురించి తెలిసిందే. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య మా ఎన్నికలు జరిగాయి.. రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించి మా అధ్యక్ష పీఠాన్ని వరించాడు. అయితే మంచు ప్యానల్ సభ్యులు ఎన్నికలలో రిగ్గింగ్ చేశారని.. సీసీ టీవీ ఫుటేజ్ తమకు అందించాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో మంచు విష్ణు స్పందిస్తూ.. ప్రకాష్ రాజ్ సీసీ ఫుటేజ్ తీసుకోవచ్చని.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు.
ఇదిలా ఉంటే.. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలపై మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులతో కలిసి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఈ క్రమంలో సీనియర్ నటుడు బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బాబూ మోహన్ మాట్లాడుతూ.. మా లోని ప్రతి సభ్యుడికి విష్ణు అధ్యక్షుడే అన్నారు.. అంగీకరించకపోతే రెండు రాష్ట్రాల ప్రజలు క్షమించరని.. ఇంకో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడిగా గెలుస్తాడని పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆవేశం తగ్గించుకోవాలని.. తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదు అన్న వ్యక్తి హైస్కూల్లో చదివాడని… కానీ విష్ణు యూనివర్సిటీ సీఈవో అన్నారు..
Also Read: Manchu Vishnu: మంచు విష్ణు సంచలన ప్రెస్‌మీట్.. పవన్, చిరంజీవి సహా కీలక విషయాలపై కామెంట్స్