MAA: లోకేషన్ షిఫ్ట్.. జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు షిఫ్టైన ‘మా’ రాజకీయం.. టాపిక్ సీసీ విజువల్స్

'మా'లో మరోకొత్త ట్విస్ట్‌. ఎన్నికల టైమ్‌లో తమపై దాడి జరిగిందని ప్రకాష్‌రాజ్‌ ఆరోపించారు.

MAA: లోకేషన్ షిఫ్ట్.. జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు షిఫ్టైన 'మా' రాజకీయం.. టాపిక్ సీసీ విజువల్స్
Prakash Raj
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 18, 2021 | 1:06 PM

‘మా’..లో మలుపులు, మెరుపులు, విరుపులు మామూలుగా లేవు.. సీన్ వెనుక సీన్ రక్తికట్టిస్తూనే ఉంది. మా ఎన్నికలు అయిపోయాక సిట్యువేషన్ కూల్ అవుతుందనుకున్నారంతా. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. రోజురోజుకి మా హీట్ అంతకంతకు పెరుగుతోంది. అసోసియేషన్‌లో ఇమడలేమని ప్రకాష్‌రాజ్ ప్యానల్‌ నుంచి గెలిచిన సభ్యులు రాజీనామాలు ప్రకటించారు. మరి అదంతా ఒట్టి డ్రామానేనా? చిత్తశుద్దితో రాజీనామా చేస్తే మా అధ్యక్షుడికి అవి ఇప్పటిదాకా ఎందుకు చేరలేదు? కావాలనే సీన్ క్రియేట్ చేశారా? బుజ్జగింపులతో మెత్తబడాలని కథ అల్లేశారా? మోనార్క్‌ మాత్రం రాజీనామా లేఖల్ని తొందర్లోనే పంపిస్తామంటున్నారు. మరి ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారన్నది మిస్టరీగా మారింది.

ఎన్నిక‌లు అయిన వెంటనే మోహ‌న్ బాబు త‌మ‌పై దాడి చేశార‌ని, బూతులు తిట్టార‌ని ఆరోపిస్తూ రాజీనామాలు చేశారు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ కావాలని ఈసీకి లేఖ కూడా రాశారు ప్రకాష్‌రాజ్. ఈసీ నుంచి రిప్లయ్ రావడం లేదంటూ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కి వెళ్లారు. అక్కడినుంచి పోలీసులకు కాల్‌ చేశారు. అయితే సీసీ ఫుటేజ్ చూడాలంటే ఇరు వర్గాల ప్యానల్ సభ్యులు ఉండాలని సూచించారు పోలీసులు. సీసీ ఫుటేజ్ కావాలని డిమాండ్ చేస్తున్న ప్రకాష్‌ రాజ్‌.. తన ఫైట్‌ అంతా ఈసీతోనే అని స్పష్టం చేశారు. ఎన్నికల రోజు ఏదో జరిగిందన్న అనుమానాలను కొట్టిపడేశారు విష్ణు. కానీ దానిపైనే క్లారిటీ కావాలంటున్నారు మోనార్క్‌. ఎవరివాదన వారిదే.. ఇంతకీ ‘మా’ ఎపిసోడ్‌కి క్లైమాక్స్‌ ఉంటుందా..? ఇలాగే కంటిన్యూ అవుతుందా అన్న చర్చ ఫిలింనగర్‌ను హీటెక్కిస్తోంది.

Also Read: మంచు విష్ణు సంచలన ప్రెస్‌మీట్.. పవన్, చిరంజీవి సహా కీలక విషయాలపై కామెంట్స్

పండక్కి అత్తగారింటకి వచ్చి బైక్స్‌కు ఫైన్ వేసిన ఎస్సై… గ్రామస్తులు ఏం చేశారంటే