సర్కార్ సీజన్ 4’.. ప్రోమో విడుదల చేసిన ఆహా.. యాంకరింగ్ ఇరగదీసిన సుధీర్
‘సర్కార్ సీజన్ 4’కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. సీజన్4కు సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోండటం విశేషం. ప్రోమో చూస్తుంటే ప్రేక్షకులు ఊహించని అతిథులు రాకతో సందడి చేయబోతున్నారు. అలాగే అదిరిపోయే ట్విస్టులతో ఈ సీజన్ మరింత ఎంటర్‌టైనింగ్‌గా ఉండనుంది.
తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. అందులో భాగంగా విశేష ఆదరణను దక్కించుకున్న ‘సర్కార్ సీజన్ 4’కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. సీజన్4కు సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోండటం విశేషం. ప్రోమో చూస్తుంటే ప్రేక్షకులు ఊహించని అతిథులు రాకతో సందడి చేయబోతున్నారు. అలాగే అదిరిపోయే ట్విస్టులతో ఈ సీజన్ మరింత ఎంటర్‌టైనింగ్‌గా ఉండనుంది.
ఈ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సుడిగాలి సుధీర్ దుస్తులు పెట్రోలు బంకులో పని చేసేవాళ్లు వేసుకునేలా ఉందంటూ దర్శకుడు తరుణ్ భాస్కర్ విసిరిన పంచ్ నవ్వులు పూయిస్తుంది. తమదైన కామెడీతో మెప్పించే రాహుల్ రామకృష్ణ, జీవన్ కూడా ఈ సీజన్‌లో పాల్గొన్నారని..వారు సుధీర్‌పై సరదాగా వేసిన జోకులు, వారి మధ్య ఉండే స్నేహం వంటి విషయాలు ప్రోమోలో చూడొచ్చు.
తరుణ్ భాస్కర్, రాహుల్ రామకృష్ణ, రాగ్ మయూర్, జీవన్, అనన్య నాగళ్ల, సుహాస్, బబుల్ గమ్ ఫేమ్ మానస చౌదరి తదితరులు ఈ సీజన్‌లో పాల్గొంటున్నారు. ఈ అతిథుల లిస్టు షోకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చింది. ప్రోమోను గమనిస్తే షోకు వచ్చిన గెస్టులందరూ సర్కార్ సీజన్ 4కు సంబంధించిన థ్రిల్లింగ్ గేమ్స్‌లో మునిగి తేలారనే విషయం స్పష్టమవుతుంది. దీనికి సంబంధించిన విషయాలు ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాయి.
సర్కార్ ప్రీమియర్ షో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే ఉత్కంఠకు ప్రోమో అద్దం పడుతోంది. మనసునిండేలా నవ్వుకోవటం, థ్రిల్లింగ్ గేమ్స్‌తో సర్కార్ సీజన్ 4 తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్‌ను అందించటానికి సిద్ధమవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.