AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ .. ఏంటో తెలిస్తే షాకవుతారు?

ప్రపంచంలో అత్యంత బిజీగా ఉండే వ్యక్తులలో ఎలాన్ మస్క్ ఒకరు. టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ సంస్థలను నడుపుతూ.. రాత్రింబవళ్లు శ్రమిస్తూ అసాధ్యాలను సుసాధ్యం చేసే ప్రపంచ కుబేరుడు మస్క్, తన సక్సెస్ సీక్రెట్స్ గురించి అప్పుడప్పుడు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటారు.

Elon Musk: సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ .. ఏంటో తెలిస్తే షాకవుతారు?
Elon Musk
Nikhil
|

Updated on: Jan 22, 2026 | 12:28 AM

Share

తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మనం పదే పదే ఎదుర్కొనే ‘బద్ధకం’ అనేది కేవలం క్రమశిక్షణ లేకపోవడం వల్ల వచ్చేది కాదట. అసలు బద్ధకం ఎందుకు వస్తుంది? మన మెదడును ఎలా మభ్యపెట్టి పనులను వేగంగా పూర్తి చేయవచ్చు? మస్క్ సూచించిన ఆ ‘మోటివేషన్ హ్యాక్’ ఏంటి?

బద్ధకం.. క్రమశిక్షణ లోపం కాదు

ప్రసిద్ధ కార్టూనిస్ట్ మరియు రచయిత స్కాట్ ఆడమ్స్ రూపొందించిన ఒక వీడియోను మస్క్ తన ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో స్కాట్ ఆడమ్స్ ఒక షాకింగ్ నిజం చెప్పారు. మనం ఏదైనా పని చేయకుండా వాయిదా వేస్తున్నామంటే దానికి కారణం మనలో క్రమశిక్షణ లేకపోవడం కాదు, మన ఆలోచనా విధానమేనని ఆయన వివరించారు. చాలామంది ఒక పని చేయాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన కష్టం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దీనివల్ల మెదడు ఆ పనిని భారంగా భావించి బద్ధకాన్ని సృష్టిస్తుంది.

డోపమైన్ పాత్ర

మన శరీరంలో ‘డోపమైన్’ అనే కెమికల్ మనల్ని పనులు చేసేలా ప్రేరేపిస్తుంది. మనం ఏదైనా పని చేసినప్పుడు వచ్చే సంతోషం లేదా ప్రతిఫలం మీద దృష్టి పెట్టినప్పుడు మన మెదడులో ఈ డోపమైన్ విడుదలవుతుంది.

  • మీరు వ్యాయామం చేయాలనుకున్నప్పుడు పడే కష్టం గురించి కాకుండా, అది చేశాక మీరు ఎంత ఫిట్‌గా కనిపిస్తారో, ఆ రివార్డ్ గురించి ఊహించుకోవాలి.
  • మనం ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడానికి లేవడం కూడా ఒక పని. కానీ ఆ పనిలోని కష్టం కంటే, ఆ భోజనం తింటే కలిగే తృప్తిని మెదడు ఊహిస్తుంది కాబట్టే మనం బద్ధకాన్ని వదిలి లేస్తాం.

మస్క్ ఫిలాసఫీ..

ఎలాన్ మస్క్ తన జీవితంలో అత్యున్నత లక్ష్యాలను పెట్టుకుంటారు. ఆయన ఏ పని చేసినా దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం లేదా ఫలితం మీదే దృష్టి పెడతారు. అందుకే ఆయనకు అలసట అనేది ఉండదు. ఈ వీడియో ద్వారా ఆయన తన ఫాలోవర్లకు చెబుతున్న సందేశం ఒక్కటే.. “మీ పనిని ఒక శిక్షలా కాకుండా, దానివల్ల వచ్చే అద్భుతమైన ఫలితంలా చూడండి.”

బద్ధకానికి కేవలం మైండ్ సెట్ మాత్రమే కాదు, తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక కారణమని నెటిజన్లు ఈ పోస్ట్‌పై స్పందిస్తున్నారు. శరీరం అలసిపోయినప్పుడు మెదడు మొరాయిస్తుందని, కాబట్టి శారీరక ఆరోగ్యంతో పాటు లక్ష్యంపై స్పష్టత ఉంటే బద్ధకం దరిచేరదని మస్క్ షేర్ చేసిన ఈ వీడియో సారాంశం. బద్ధకాన్ని జయించడం అంటే మనల్ని మనం బలవంతంగా తోసుకోవడం కాదు, మన మెదడుకు పనిలోని తీపిని చూపించడం. స్కాట్ ఆడమ్స్ చెప్పిన ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే వాయిదా వేయడం అనే సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.

Follow Us
వేసవిలో మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? అరోగ్య సమస్యలు వస్తాయ్..
వేసవిలో మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? అరోగ్య సమస్యలు వస్తాయ్..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు మించిన క్రేజ్
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు మించిన క్రేజ్
ఇంట్లోనే కూర్చుని నెలకు రూ.20 వేల సంపాదన.. దీని గురించి తెలుసా?
ఇంట్లోనే కూర్చుని నెలకు రూ.20 వేల సంపాదన.. దీని గురించి తెలుసా?
యముడు ప్రతిష్ఠించిన శివలింగం.. అపమృత్యు దోషాలు తొలగించే ఈ ఆలయం..
యముడు ప్రతిష్ఠించిన శివలింగం.. అపమృత్యు దోషాలు తొలగించే ఈ ఆలయం..
రాహు ,కేతువుల కాలసర్పయోగం.. ఈ నాలుగు రాశులపై ప్రభావం!
రాహు ,కేతువుల కాలసర్పయోగం.. ఈ నాలుగు రాశులపై ప్రభావం!
RCB, SRH జట్లకు బిగ్ షాక్.. తొలి మ్యాచ్ నుంచి ఇద్దరు తోపులు ఔట్?
RCB, SRH జట్లకు బిగ్ షాక్.. తొలి మ్యాచ్ నుంచి ఇద్దరు తోపులు ఔట్?
ఇరాక్‌ షిప్‌ బ్లాస్ట్‌ ఘటనలో భారతీయుడి మృతి..!
ఇరాక్‌ షిప్‌ బ్లాస్ట్‌ ఘటనలో భారతీయుడి మృతి..!
మహాలక్ష్మీ రాజయోగం .. ఈ రాశుల వారు కోట్లు కొల్లగొట్టడం ఖాయం!
మహాలక్ష్మీ రాజయోగం .. ఈ రాశుల వారు కోట్లు కొల్లగొట్టడం ఖాయం!
టెన్త్ విద్యార్ధులకు 'నిమిషం' టెన్షన్ లేదు.. 30 ని ఆలస్యమైనా ఓకే!
టెన్త్ విద్యార్ధులకు 'నిమిషం' టెన్షన్ లేదు.. 30 ని ఆలస్యమైనా ఓకే!
నా కూతురి ఆచూకీ చెప్పండయ్యా.. పీఎస్‌లో తండ్రి ఏం చేశాడో తెలిస్తే
నా కూతురి ఆచూకీ చెప్పండయ్యా.. పీఎస్‌లో తండ్రి ఏం చేశాడో తెలిస్తే