Business Idea: మీ ఊర్లో మీరే ముందు స్టార్ట్ చేయండి! మంచి డిమాండ్ ఉన్న బిజినెస్.. కళ్లు చెరిగే ఆదాయం!
గ్రామాల్లో మెడికల్ షాప్‌లకు భారీ డిమాండ్ ఉంది. ఇక్కడ ఆర్‌ఎంపీలు, చిన్నచిన్న జబ్బులకు వైద్యం ప్రధానం. షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు నిత్యం మందులు అవసరం. ఈ అవసరాన్ని తీరుస్తూ, మంచి ఆదాయం పొందే అవకాశం మెడికల్ షాప్ బిజినెస్. దీనికి లైసెన్స్, బీ-ఫార్మసీ సర్టిఫికెట్లు అవసరం.

నగరాల్లో అంటే వీధికో ఆస్పత్రి ఉంటుంది. కానీ గ్రామాల్లో అలా కాదు ఆర్‌ఎంపీలే దిక్కు. చాలా మంది ఇప్పటికీ గ్రామాల్లో జ్వరం వచ్చినా కూడా అదే తగ్గిపోతుందిలే అని వదిలేస్తారు కానీ ఆస్పత్రికి వెళ్లరు. మహా అయితే ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి ఒక టాబ్లెట్ లేదా ఒక ఇంజెక్షన్ తీసుకుంటారు. ఒక వారం పాటు జ్వరం అలాగే ఉంటే తప్పితే పెద్దాస్పత్రికి వెళ్లరు. గింత జ్వరానికి అంత దూరం ఏం వెళ్తాంలే అని అనుకుంటారు. అదే ఊర్లోనే ఒక మెడికల్ షాప్ ఉంటే.. వెంటనే ఉరికొస్తారు. అయితే కేవలం జ్వరమే కాదు కదా.. ఇప్పుడు షుగర్, బీపీలు అందరికీ కామన్ అయిపోయాయి.
పల్లెల్లో ఉండే వారు కూడా ఈ జబ్బుల బారిన పడి ప్రతి రోజు మెడిసిన్ మింగాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో అలాంటి వారికి ఒక విధంగా సేవ చేయడంతో పాటు మంచి ఆదాయం పొందే బిజినెస్ ఒకటి ఉంది. అదే మెడికల్ షాప్. ఇప్పటికీ మెడికల్ షాప్ లేని గ్రామాలు లక్షల్లో ఉన్నాయి. అలాంటి ఓ మంచి గ్రామాన్ని ఎంచుకొని ఓ రూమ్ అద్దెకు తీసుకొని, లేదా మీరే ఒక రూమ్ నిర్మించుకొని మెడికల్ షాప్ పెట్టుకుంటే మంచి ఆదాయం పొందవచ్చు. అయితే మెడికల్ షాప్ పెట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
అందుకోసం లైసెన్స్, బీ ఫార్మసీ చదివినట్లు సర్టిఫికేట్లు కూడా అవసరం. అయితే అలా చదవిన వారిని మీ షాప్‌లో ఉద్యోగం ఇచ్చి, మీరు పెట్టుబడి పెట్టి కూడా మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు. ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఓ రూ.5 లక్షల వరకు ఖర్చు అవ్వొచ్చు. రూమ్ నిర్మాణం, ర్యాకులు, ఒక ఫ్రిడ్జ్ వంటివి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే మెడిసన్స్ కోసం కూడా బాగానే ఖర్చు అవుతుంది. కానీ, ఒక్కసారి ప్రజల్లో మీపై నమ్మకం ఏర్పడితే ఇక మీ లైఫ్ సెట్ అయిపోయినట్టే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
