Frozen Chicken: ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే.. ఎందుకో తెలుసా?
Frozen chicken health risks: ఫ్రోజెన్ చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోకుంటే దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతారని హెచ్చరిస్తున్నారు. ఫ్రోజెన్ చికెన్ అనేది కోసిన తర్వాత ప్రత్యేక రసాయనాలు లేదా తక్కువ ఉష్ణోగ్రతల్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా ప్రాసెస్ చేసిన మాంసం. దీన్ని నెలల తరబడి ఫ్రీజర్‌లో భద్రపరచి విక్రయిస్తారు.

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి వండుకుని తినే సమయం కూడా ఉండటం లేదు. మార్కెట్‌కు వెళ్లి ఆహార పదార్థాలను తెచ్చుకునే ఓపికా ఉండటం లేదు. అందుకే చాలా మంది ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. మరికొంత మంది ఇంట్లోనే సమయం ఉన్నప్పుడు వండుకుని తింటారు. అందుకే చాలా మంది ఆహార పదార్థాను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతారు. మరికొందరు ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాహారాలను ఆర్డర్ చేసి వండుకుంటున్నారు. అయితే అలా అన్ని ఆహార పదార్థాలను ఎక్కువ సమయంపాటు ఫ్రిజ్‌లో నిల్వ చేయడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడు మనం ఫ్రోజెన్ చికెన్ తింటే ఆరోగ్యానికి మంచిదా? లేదా అనారోగ్యాలకు కారణమవుతుందా? అనే విషయాలను తెలుసుకుందాం.
ఫ్రోజెన్ చికెన్ అంటే ఏమిటి?
ఫ్రోజెన్ చికెన్ అనేది కోసిన తర్వాత ప్రత్యేక రసాయనాలు లేదా తక్కువ ఉష్ణోగ్రతల్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా ప్రాసెస్ చేసిన మాంసం. దీన్ని నెలల తరబడి ఫ్రీజర్‌లో భద్రపరచి విక్రయిస్తారు.
ఫ్రోజెన్ చికెన్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు
ఎక్కువకాలం ఫ్రీజ్ చేసిన చికెన్ జీర్ణం కావడానికి కష్టం. తరచూ తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫ్రోజెన్ ప్రక్రియలో చికెన్‌లోని ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు క్రమంగా తగ్గిపోతాయి. తాజా చికెన్‌తో పోలిస్తే పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి. సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయని ఫ్రోజెన్ చికెన్‌లో సాల్మొనెల్లా ఈ-కోలి వంటి బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఇవి ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలకు కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో ఫ్రోజెన్ చికెన్‌ను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్, యాంటీబయాటిక్స్, హార్మోన్లు వాడుతున్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి దీర్ఘకాలంలో హార్మోనల్ అసమతుల్యత రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది.
పిల్లలు, వృద్ధులకు మరింత ప్రమాదం
ఫ్రోజెన్ చికెన్ వల్ల కలిగే దుష్ప్రభావాలు పిల్లలు, వృద్ధులు, గర్భిణీలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. వారి జీర్ణశక్తి తక్కువగా ఉండటంతో ఆరోగ్య సమస్యలు త్వరగా రావచ్చు.
తాజా చికెన్ ఎందుకు మంచిది?
పోషక విలువలు ఎక్కువ ఉండటంతోపాటు సులభంగా జీర్ణమవుతుంది. రసాయనాల ముప్పు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది. అందుకే సాధ్యమైనంతవరకు తాజా చికెన్‌ను మాత్రమే వినియోగించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఫ్రోజెన్ చికెన్ తినాల్సి వస్తే పాటించాల్సిన జాగ్రత్తలు
నమ్మకమైన బ్రాండ్‌ను మాత్రమే కొనుగోలు చేయాలి. ఎక్స్‌పైరీ తేదీ తప్పక చూడాలి. పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలి. మళ్లీ మళ్లీ ఫ్రీజ్ చేయకూడదు. చివరగా.. సౌకర్యం కోసం ఫ్రోజెన్ చికెన్‌ను ఎంచుకుంటున్నా.. ఆరోగ్యమే అసలైన సంపద అనే విషయాన్ని మర్చిపోకూడదు. తరచూ ఫ్రోజెన్ చికెన్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంతవరకు తాజా, శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడమే ఉత్తమ మార్గం.
