AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో.. ఎవరంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లాది మంది ప్రేమాభిమానాలు సంపాదించుకున్న ఆయనను స్టార్ హీరోలు సైతం అమితంగా అభిమానిస్తారు. అందులో ఈ టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఒకడు. తాజాగా అతను పవర్ స్టార్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా అవి నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో.. ఎవరంటే?
Pawan Kalyan
Basha Shek
|

Updated on: Feb 10, 2026 | 7:46 PM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోస్టర్స్, కటౌట్లు, పాలాభిషేకాలు, బాణసంచా.. అబ్బో థియేటర్ల ముందు ఓ రకమైన పండగ వాతావరణం ఉటుంది. ఇక ఒక్కోసారి అభిమానులను నియంత్రించేందుకు పోలీసులకు తమ లాఠీలకు కూడా పనిచెప్పాల్సి ఉంటుంది. 2013లో రిలీజైన అత్తారింటికి దారేది సినిమా ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా మొత్తం ఆన్ లైన్ లో లీకైనా ఈ మూవీ సంచలన విజయం సాధించింది. పవన సినిమాను థియేటర్లలో చూసేందుకు క్యూలు కట్టారు. కొన్ని చోట్ల ప్రేక్షకులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ లు కూడా చేశారు. అలా అప్పుడు పవన్ కల్యాణ్ సినిమాకు వెళ్లి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న వారిలో ఒక టాలీవుడ్ హీరో కూడా ఉన్నాడు. అతను మరెవరో కాదు సంతోష్ శోభన్. చాలా గ్యాప్ తర్వాత కపుల్ ఫ్రెండ్లీ అనే యూత్ ఫుల్ లవ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడీ యంగ్ హీరో. మిస్ ఇండియా బ్యూటీ మానస వారణాసి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటున్నాడు సంతోష్ శోభన్. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాను జనాల్లోకి తీసుకెళుతున్నాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడీ ట్యా లెంటెడ్ హీరో. ఈ క్రమంలోనేఒక ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు సంతోష్. ‘నేను పపన్ కల్యాణ్ కు వీరాభిమాని. అత్తారింటికి దారేది సినిమా విడుదల సమయంలో నాపై పోలీసు లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఆ సినిమ ఫస్ట్ డే ఫస్ట్ షో నేను కూడా థియేటర్ కు వెళ్లాను. టిక్కెట్లు దొరక్కపోవడంతో కొందరు సినిమా థియేటర్ అద్దాలు పగలగొట్టారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నాను. అలా పోలీసులతో దెబ్బలు తినడం అదే మొదటి, చివరిసారి కూడా’ అని చెప్పుకొచ్చాడు సంతోష్ శోభన్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఇందుకు సంబంధించిన వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కపుల్స్ ఫ్రెండ్లీ సినిమా ప్రమోషన్లలో సంతోష్ శోభన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.