Samyukta Menon : రానాకు జోడీగా మలయాళీ ముద్ద మందారం.. భీమ్లానాయక్ సినిమాలో సోయగాల సంయుక్త..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే రీఎంట్రీ ఇచ్చి వాకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ హిట్ అనుకున్నారు. ఇక ఇప్పుడు అదే జోష్‌లో తన నెక్స్ట్ సినిమా భీమ్లా నాయక్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు
Samyukta Menon : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే రీఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ హిట్ అనుకున్నారు. ఇక ఇప్పుడు అదే జోష్‌లో తన నెక్స్ట్ సినిమా భీమ్లా నాయక్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. భీమ్లానాయక్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈసినిమా పోస్టర్లు, టీజర్లు సినిమా పై ఆసక్తిని పెంచాయి. అటు భీమ్లానాయక్‌గా పవన్.. డానియల్ శేఖర్‌గా రానా ఇద్దరు అదరగొట్టాడు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భీమ్లానాయక్ సినిమాలో పవన్కు జోడీగా నిత్యామీనన్ నటించనుంది. అయితే రానా సరసన ఎవరు నటించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అయితే రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని మొన్నటివరకు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు రానాకు జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ నటించనుందని తెలుస్తుంది. ఈ సినిమాకోసం ‘సంయుక్త మీనన్’ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది సంయుక్త. సంయుక్త మీనన్ తమిళ… మలయాళ.. కన్నడ సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం ‘బింబిసార’. ఈ సినిమాలో ఆమె కల్యాణ్ రామ్ సరసన కనిపించనుంది. ఇప్పుడు రానాకు జోడీగా నటించనుంది. ఇక భీమ్లానాయక్ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. అలాగే రానా విరాటపర్వం సినిమాలో నటిస్తున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి