Idhe Maa Katha : సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాం.. ఇప్పుడు ఆ కష్టమంతా మర్చిపోయాం..
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జీ మహేష్ తెరకెక్కిన ఈ సినిమాకు గురు పవన్ దర్శకుడు.
Idhe Maa Katha : సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జీ మహేష్ తెరకెక్కిన ఈ సినిమాకు గురు పవన్ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియాతో మాట్లాడారు.. ఈసందర్భంగా దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ.. ‘మౌత్ పబ్లిసిటీతోనే ఈ సినిమా ముందుకు వెళ్తోంది. అందుకే ఈ సక్సెస్ మీట్‌కు ఎమోషనల్ హిట్ అని పెట్టాం. యూత్ కూడా సినిమా చూసి వారి ఫ్యామిలీని తీసుకెళ్లి చూపించారు. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. ఎన్నో రోజుల నుంచి థియేటర్లకు దూరంగా ఉన్న మహిళను థియేటర్లకు రప్పించాలని ప్రయత్నం చేశాం. అందులో సక్సెస్ అయ్యాం. ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ దక్కుతోంది అన్నారు. అలాగే హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ బాగుందని ఫోన్లు చేస్తున్నారు. దర్శకుడు ఎంతో బాగా చిత్రాన్ని తెరకెక్కించారని చెబుతున్నారు. లడఖ్ అంటే ఇలా ఉంటుందా..? అని సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ అంటున్నారు. చాలా రోజుల తరువాత నాకు మంచి విజయం దక్కింది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని అన్నారు
హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ సెకండ్ ఆఫ్ కు కనెక్ట్ అయ్యారు. చివరి 45 నిమిషాలు, లొకేషన్స్, పాటలు, డైరెక్షన్స్ ఇలా అన్నింటిని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని ఎక్కువగా టెన్షన్ పడ్డాం. దాదాపు రెండేళ్లు కష్టపడి చేశాం. కానీ ఆ కష్టం అంతా కూడా ప్రేక్షకుల ప్రశంసలతో మరిచిపోయాం. సినిమాను థియేటర్లో చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ అద్భుతంగా ఉంది. ఆడియెన్స్ అంతా కూడా పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. ఇంత మంచి విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి