టాలీవుడ్ స్టార్ డైరక్టర్ సినిమాలో హీరోగా సంపూ!

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ సినిమాలో హీరోగా సంపూ!
Burning Star

‘హృదయకాలేయం’ లాంటి పేరడీ మూవీతో అనూహ్యంగా స్టార్ డమ్ తెచ్చుకన్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు. ఆ తర్వాత అతని క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు హీరోగా చేసినా, మధ్యమధ్యలో కొన్ని మూవీస్ క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా చేసినా అవి అంతగా క్లిక్ కాలేదు. ఇటీవల వచ్చిన కొబ్బరిమట్టతో మాత్రం సంపూ మరోపారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.  అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా.. ఊహించని వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్​ అగ్ర […]

Ram Naramaneni

|

Sep 01, 2019 | 10:21 PM

‘హృదయకాలేయం’ లాంటి పేరడీ మూవీతో అనూహ్యంగా స్టార్ డమ్ తెచ్చుకన్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు. ఆ తర్వాత అతని క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు హీరోగా చేసినా, మధ్యమధ్యలో కొన్ని మూవీస్ క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా చేసినా అవి అంతగా క్లిక్ కాలేదు. ఇటీవల వచ్చిన కొబ్బరిమట్టతో మాత్రం సంపూ మరోపారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.  అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా.. ఊహించని వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్​ అగ్ర నిర్మాతలు చూపు సంపూపై పడింది. అతడితో ఓ చిన్న బడ్జెట్​ కామెడీ సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర దర్శకుడు క్రిష్​.. బర్నింగ్​స్టార్​తో త్వరలో ఓ వినోదాత్మక చిత్రం చేయనున్నాడని సమాచారం. నిర్మాత సి.కల్యాణ్.. సంపూతో ఓ ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు ప్రణాళికల రచిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu