‘సాహో’ మూవీపై ఫైర్ అయిన ఫ్రెంచ్‌ డైరక్టర్! ఎందుకంటే?

'సాహో' మూవీపై ఫైర్ అయిన ఫ్రెంచ్‌ డైరక్టర్! ఎందుకంటే?
Largo Winch director responds to claims of Saaho being 'inspired' by his film

హిట్టూ, ఫ్లాపుతో సంబంధం లేకుండా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  ‘సాహో’ మూవీ దూసుకుపోతుంది. విడుదలయిన రెండు రోజుల్లోనే 205 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. కాగా సాహోపై విమర్శల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటికే సాహోలోని ఒక సాంగ్‌లో వాడిన ఆర్ట్ వర్క్ మరొకరిది అంటూ లీసారే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీపై  ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు జెరోం సల్లే మండిపడ్డారు. తన చిత్రం ‘లార్గో వించ్’ను స్ఫూర్తిగా తీసుకుని […]

Ram Naramaneni

|

Sep 01, 2019 | 9:41 PM

హిట్టూ, ఫ్లాపుతో సంబంధం లేకుండా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  ‘సాహో’ మూవీ దూసుకుపోతుంది. విడుదలయిన రెండు రోజుల్లోనే 205 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. కాగా సాహోపై విమర్శల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటికే సాహోలోని ఒక సాంగ్‌లో వాడిన ఆర్ట్ వర్క్ మరొకరిది అంటూ లీసారే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీపై  ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు జెరోం సల్లే మండిపడ్డారు. తన చిత్రం ‘లార్గో వించ్’ను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారని ట్వీట్‌ చేశారు. గతంలోనూ పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘అజ్ఞాతవాసి’పై ఆయన స్పందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను కూడా ‘లార్గో వించ్‌’ ప్రేరణతో తీశారని ఆయన అన్నారు. అప్పట్లో అది హాట్‌టాపిక్‌ అయ్యింది.కాగా ఇప్పుడు జెరోం ‘సాహో’ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. రెండోసారి ‘లార్గో వించ్‌’ను ‘ఫ్రీమేక్‌’ చేశారని తప్పుపట్టారు. ‘సాహో’ తనకు నచ్చలేదని తెలిపారు. తన సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారని, కానీ దాన్ని సక్రమంగా తెరకెక్కించలేదని.. కాస్త చూసుకుని రీమేక్‌లు చేయాలని సలహా ఇచ్చారు. ఈ విషయంపై ఇంకా మూవీ యూనిట్ రెస్పాండ్ అవ్వలేదు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu