పవన్ కళ్యాణ్ బర్త్ డే..పండుగలా చేస్తోన్న ఫ్యాన్స్!

పవన్ కళ్యాణ్ బర్త్ డే..పండుగలా చేస్తోన్న ఫ్యాన్స్!
Pawan Kalyan Birthday

పవన్ కళ్యాణ్..ఈ నేమ్ గురించి స్ఫెషల్‌గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఆ పేరు చెప్పగానే తెలుగువారు ఎక్కడ ఉన్నా ఓ వైబ్రేషన్ తాకుతుంది. సినిమా నటుడిగా ఉన్నా, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారిన  క్రేజ్ ఏ మాత్రం తగ్గని రేంజ్ ఆయనది. బాక్సాఫీస్ దగ్గర ఎన్నో లెక్కలు తేల్చిన ఈ స్టార్ నటుడు..ఇప్పుడు ప్రజల్లో మనుసుల్లో నిలిచిపోయేందుకు ప్రజాబరిలోకి దిగారు. ఆయన నటించిన సినిమా ప్లాపైనా రికార్డు రేంజ్‌ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఏకంగా ఏళ్ల పాటు హిట్ […]

Ram Naramaneni

|

Sep 02, 2019 | 10:07 AM

పవన్ కళ్యాణ్..ఈ నేమ్ గురించి స్ఫెషల్‌గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఆ పేరు చెప్పగానే తెలుగువారు ఎక్కడ ఉన్నా ఓ వైబ్రేషన్ తాకుతుంది. సినిమా నటుడిగా ఉన్నా, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారిన  క్రేజ్ ఏ మాత్రం తగ్గని రేంజ్ ఆయనది. బాక్సాఫీస్ దగ్గర ఎన్నో లెక్కలు తేల్చిన ఈ స్టార్ నటుడు..ఇప్పుడు ప్రజల్లో మనుసుల్లో నిలిచిపోయేందుకు ప్రజాబరిలోకి దిగారు.

ఆయన నటించిన సినిమా ప్లాపైనా రికార్డు రేంజ్‌ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఏకంగా ఏళ్ల పాటు హిట్ లేకపోయినా ఇమేజ్ ఏ మాత్రం చెక్కుచెదరదు. ఆయన అడుగు పెడితే సెన్సేషన్. అంతెందుకు ఆయన కటౌట్ కనపడితేనే ఓ ఎమోషన్. ఎందుకంటే ఆయన అందరిలా వచ్చివెళ్లిపోయే వ్యక్తి కాదు… సమాజం కోసం ఉద్భవించిన శక్తి. కొణిదెల పవన్​కల్యాణ్..ఇప్పుడు జనసేనానిగా మారి ప్రజల హృదయాలను ఏలే దిశగా ముందడుగు వేస్తున్నారు.

మెగాస్టార్​ చిరంజీవి తమ్ముడిగా సినీఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమక్రమంగా సినిమాల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. అతడ్ని కథానాయకుడిగా ఎంత మంది అభిమానిస్తారో, వ్యక్తిగా అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తారు. కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు పవన్‌ కల్యాణ్. ఇతడికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. పెద్దన్నయ్య చిరంజీవి, నటుడు నిర్మాత అయిన నాగబాబు రెండో అన్నయ్య.

కంప్యూటర్స్‌లో డిప్లొమా చేసిన పవన్​కల్యాణ్… సినిమా అంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా అన్నయ్య చిరంజీవి సతీమణి సురేఖ ప్రోద్బలంతో హీరోగా మారాడు. ఆ తర్వాత పవర్ స్టార్‌గా మారి ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోలేని ముద్ర వేశాడు. 2014 మార్చి 14న జనసేన అనే రాజకీయ పార్టీ స్థాపించాడు​. అజ్ఞాతవాసి సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాలకే సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ రోజు 49 పుట్టినరోజు జరుపుకుంటోన్న శుభసందర్భాన టీవీ9 జనసేనానకి స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్తుంది. #HappyBirthdayPawanKalyan


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu