యంగ్ హీరో కోసం నిర్మాతగా మారనున్న రానా?

యంగ్ హీరో కోసం నిర్మాతగా మారనున్న రానా?
Rana Daggubati in turn producer for the film Raj Tarun Film

రానా దగ్గుబాటి..ఇతడు ఇప్పడు టాలీవుడ్‌కి మాత్రమే హీరో కాదు. సౌత్‌లో అన్ని భాషల్లో నటించేస్తున్నాడు. నార్త్‌లో కూడా కొన్ని మూవీస్ చేశాడు. అంతేకాదు పక్క కంట్రీస్ నుంచి కూడా రానాకు ఆఫర్స్ వస్తున్నాయి.  బాహుబలితో అతడు తెచ్చుకున్న క్రేజ్ అలాంటిది మరి. అయితే ఈ హీరో నటనతో పాటు సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి తాత వారసత్వం నిలబెడుతున్నాడు.  గతేడాది సురేశ్ ప్రొడక్షన్స్ లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం మూవీకి సమర్పకుడిగా వ్యవహరించిన రానా… ఇప్పుడు మరోసారి నిర్మాతగా […]

Ram Naramaneni

|

Sep 02, 2019 | 11:10 AM

రానా దగ్గుబాటి..ఇతడు ఇప్పడు టాలీవుడ్‌కి మాత్రమే హీరో కాదు. సౌత్‌లో అన్ని భాషల్లో నటించేస్తున్నాడు. నార్త్‌లో కూడా కొన్ని మూవీస్ చేశాడు. అంతేకాదు పక్క కంట్రీస్ నుంచి కూడా రానాకు ఆఫర్స్ వస్తున్నాయి.  బాహుబలితో అతడు తెచ్చుకున్న క్రేజ్ అలాంటిది మరి. అయితే ఈ హీరో నటనతో పాటు సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి తాత వారసత్వం నిలబెడుతున్నాడు.  గతేడాది సురేశ్ ప్రొడక్షన్స్ లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం మూవీకి సమర్పకుడిగా వ్యవహరించిన రానా… ఇప్పుడు మరోసారి నిర్మాతగా మారనున్నాడని సమాచారం.

చాలా తక్కువ టైంలో హీరోగా మంచి పేరు తెచ్చుకోని, ఇటీవల కారు యాక్సిడెంట్ తో వార్తల్లో నిలిచిన రాజ్ తరుణ్ హీరోగా రానా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాడనే వార్త ఫిలింనగర్ లో షికారు చేస్తోంది. కేరాఫ్ కంచరపాలెం సినిమా కథ విని తాను ఓ భాగస్వామిగా వ్యవహరించాడు. దీంతో ఆ సినిమాకు మంచి డిమాండ్ వచ్చింది. రిలీజ్ కు ముందు ఆ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లడానికి ప్రధాన కారణం రానా అనడంలో ఎటువంటి సందేహం లేదు. మంచి కంటెంట్ తో, దర్శకుడి ప్రతిభతో ఆ సినిమా హిట్ అయింది. దీంతో అభిరుచి గల నిర్మాతగా రానా ఇండస్ట్రీలో కొత్త అవతారం ఎత్తాడనే చెప్పాలి. ఔత్సాహికులు తమ కథలను సురేశ్ బ్యానర్ ను మెప్పిస్తే చాలు.. సినిమా ఖాయమనే నమ్మకం ఏర్పడింది. అలాంటి ఓ కథనే ఇప్పుడు రానా విని ఓకే చేసాడని వార్తలు వస్తున్నాయి. రాజ్ తరుణ్ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ఇద్దరి లోకం ఒకటే.. అనే సినిమా చేస్తున్నాడు. మరి రానా నిర్మాణంలో ఈ యంగ్ హీరో  క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతందో చూడాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu