‘సాహో’ మూవీపై కేటీఆర్ రెస్పాన్స్!

'సాహో' మూవీపై కేటీఆర్ రెస్పాన్స్!
KTR in awe of Saaho and Evaru

ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సాహో’ చిత్రానికి ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. రూ. 350 కోట్లభారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల అంచనాలకు  ‘సాహో’  పూర్తి స్థాయితో అందుకోలేకపోయింది. సినిమా రివ్యూల మాట ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం అదరగొడుతున్నాయి. తాజాగా ‘సాహో’ మూవీ చూసిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెటిజన్లతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. […]

Ram Naramaneni

|

Sep 02, 2019 | 11:48 AM

ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సాహో’ చిత్రానికి ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. రూ. 350 కోట్లభారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల అంచనాలకు  ‘సాహో’  పూర్తి స్థాయితో అందుకోలేకపోయింది. సినిమా రివ్యూల మాట ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం అదరగొడుతున్నాయి. తాజాగా ‘సాహో’ మూవీ చూసిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెటిజన్లతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

సాంకేతికపరంగా ‘సాహో’ అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు. ‘ఈ రోజు నేను రెండు అద్భుతమైన తెలుగు సినిమాలు చూశాను. అందులో ఒకటి ‘సాహో’. సాంకేతికంగా అద్భుతమైన చిత్రం. భారత చలనచిత్ర పరిశ్రమలోని ఫిల్మ్‌ మేకర్స్‌ స్థాయిని పెంచింది. ప్రభాస్‌, దర్శకుడు సుజిత్‌కు అభినందనలు. ‘ఎవరు’ చిత్రం స్క్రీన్‌ప్లే చాలా బాగుంది. అడవి శేషు, రెజీనా, నవీన్‌ అద్భుతంగా నటించారు.’ అని కేటీఆర్‌ తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లో రూ.205 కోట్లకుపైగా రాబట్టినట్టు నిర్మాతలు వెల్లడించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu