రోడ్‌ యాక్సిడెంట్: హాలీవుడ్ హీరోకి తీవ్రగాయలు

ప్రముఖ హాలీవుడ్ హీరో, కమెడియన్ కెవిన్ హార్ట్‌‌(40)కు పెను ప్రమాదం తప్పింది. కెవిన్, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారు రోడ్ యాక్సిడెంట్‌కు గురయ్యింది. అర్థరాత్రి అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ముల్హోల్యాండ్ రహదారిపై ప్రయాణిస్తుండగా కెవిన్ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో.. కెవిన్ అతని స్నేహితులు బ్లాక్, రెబెక్కాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో.. బ్లాక్‌కు నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. కెవిన్‌ను మరొక స్నేహితుడు రెబెక్కాను.. పెట్రోలింగ్ పోలీసులు హెలీకాఫ్టర్ ద్వారా.. హాస్పిటల్‌కు తరలించారు. కాగా.. వేగంగా వెళ్తున్న […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:52 pm, Mon, 2 September 19
రోడ్‌ యాక్సిడెంట్: హాలీవుడ్ హీరోకి తీవ్రగాయలు

ప్రముఖ హాలీవుడ్ హీరో, కమెడియన్ కెవిన్ హార్ట్‌‌(40)కు పెను ప్రమాదం తప్పింది. కెవిన్, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారు రోడ్ యాక్సిడెంట్‌కు గురయ్యింది. అర్థరాత్రి అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ముల్హోల్యాండ్ రహదారిపై ప్రయాణిస్తుండగా కెవిన్ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో.. కెవిన్ అతని స్నేహితులు బ్లాక్, రెబెక్కాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో.. బ్లాక్‌కు నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. కెవిన్‌ను మరొక స్నేహితుడు రెబెక్కాను.. పెట్రోలింగ్ పోలీసులు హెలీకాఫ్టర్ ద్వారా.. హాస్పిటల్‌కు తరలించారు. కాగా.. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పడంతో.. పక్కనే ఉన్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిందని పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తెలిపారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం కెవిన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సన్నిహితవర్గాలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Hollywood Hero Kevin Hart Hospitalized after Serious Car Accident