AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: నిర్మాణ రంగంలోకి సమంత.. కొత్త ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది. పేరెంటో తెలుసా ?..

ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన సామ్.. పలు ఈవెంట్స్, రియాల్టీ షోలలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటివరకు కథానాయికగా ప్రేక్షకులను అలరించిన సామ్..ఇప్పుడు నిర్మాతగా మారింది. కొత్తగా ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది సామ్. తన సొంత ప్రొడక్షన్ కంపెనీ పేరును రివీల్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను పంచుకుంది సామ్. దీంతో ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. సమంతకు విషెస్ తెలుపుతున్నారు నెటిజన్స్.

Samantha: నిర్మాణ రంగంలోకి సమంత.. కొత్త ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది. పేరెంటో తెలుసా ?..
Samantha
Rajitha Chanti
|

Updated on: Dec 10, 2023 | 8:11 PM

Share

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా అనంతరం ఆమె తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టారు. మయోసైటిస్ సమస్య నుంచి కోలుకోవడానికి కొన్ని నెలలు అమెరికాలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత భూటాన్ లో ఇమ్యూనిటి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన సామ్.. పలు ఈవెంట్స్, రియాల్టీ షోలలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటివరకు కథానాయికగా ప్రేక్షకులను అలరించిన సామ్..ఇప్పుడు నిర్మాతగా మారింది. కొత్తగా ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది సామ్. తన సొంత ప్రొడక్షన్ కంపెనీ పేరును రివీల్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను పంచుకుంది సామ్. దీంతో ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. సమంతకు విషెస్ తెలుపుతున్నారు నెటిజన్స్.

‘త్రాలలా మూవింగ్ పిక్చర్స్’ అనే పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది సామ్. ఈ పేరును తన ఫేవరెట్ సాంగ్ నుంచి స్పూర్తి పొంది పెట్టానని తెలిపింది. ప్రముఖ ఇంగ్లీష్ పాప్ సాంగ్ ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్’లోని లిరిక్స్ లో వచ్చే ‘త్రాలలా’ అనే పదాన్ని తీసుకుని సామ్ తన ప్రొడక్షన్ కంపెనీకి పేరుగా పెట్టారు. త్రాలలా బ్యానర్ పై కొత్త టాలెంట్, యంగ్ ఫిల్మ్ మేకర్స్ ను ప్రోత్సహిస్తూ సినిమాను నిర్మించబోతున్నారట. అంతేకాకుండా అర్థవంతమైన, ప్రామాణికమైన, యూనివర్సిల్ కథలను ఈ బ్యానర్ పై నిర్మించనున్నారు. అయితే ఇప్పుడు సామ్ సొంత నిర్మాణ సంస్థలో ముందుగా ఓ నటుడితో సినిమా తెరకెక్కించనున్నారనేది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్… ఎప్పుడెప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. చివరి సారిగా ఖుషి చిత్రంలో కనిపించింది సామ్. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. ఆ తర్వాత వరుణ్ ధావన్ జోడిగా సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.