Samantha: ‘నేను మరింత దృఢంగా మారేందుకు నాకు ఇదో అవకాశం’.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ వీడియో..

నిత్యం మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‎లో ఉంటుంది. ఇటీవల ఆమె తన జిమ్ వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు మరింత ధైర్యం చెబుతుంది. తాజాగా మరో ఆసక్తికర వీడియో షేర్ చేసింది సామ్.

Samantha: 'నేను మరింత దృఢంగా మారేందుకు నాకు ఇదో అవకాశం'.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ వీడియో..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 17, 2023 | 8:02 AM

టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ సమస్య నుంచి కోలుకుంటుంది. కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్న సామ్.. ఇప్పుడు తదుపరి చిత్రాల షూటింగ్స్ లలో పాల్గొంటుంది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటుంది. అలాగే మరికొద్ది రోజుల్లో ఖుషి సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. ఓవైపు మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోనప్పటికీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది సామ్. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది సమంత. నిత్యం మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‎లో ఉంటుంది. ఇటీవల ఆమె తన జిమ్ వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు మరింత ధైర్యం చెబుతుంది. తాజాగా మరో ఆసక్తికర వీడియో షేర్ చేసింది సామ్.

తనను తాను మరింత దృఢంగా మార్చుకునేందుకు ఈ ఏడాది తనకు సరైన అవకాశం అంటూ ఒంటి కాలిపై లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తున్న వీడియోను షేర్ చేసింది. చూసేందుకు చాలా సులభంగా ఉంది. కానీ అంత ఈజీ కాదు.. మీరు ట్రై చేయండి. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సామ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఆమెకు అభిమానులు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఎప్పటికంటే మరింత బలంగా ఉండాలి.. సామ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల జిమ్ పిక్ షేర్ చేస్తూ.. మయోసైటిస్ సమస్యకు తాను ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ (ఐవీఐజీ) తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. అలాగే ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు చిత్రాలున్నాయి. అలాగే డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రకాష్ రాజ్, అల్లు అర్హ, దేవ్ మోహన్ కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్