AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: నా హృదయంలో వీటికి ప్రత్యేక స్థానముంది….ఎట్టకేలకు నా కల నిజమైంది…

నాగ చైతన్యతో వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన సమంత...దీని ప్రభావం తన ప్రొఫెషనల్‌ కెరీర్‌పై పడకుండా జాగ్రత్త....

Samantha: నా హృదయంలో వీటికి ప్రత్యేక స్థానముంది....ఎట్టకేలకు నా కల నిజమైంది...
Samantha
Basha Shek
|

Updated on: Oct 23, 2021 | 11:38 AM

Share

నాగ చైతన్యతో వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన సమంత…దీని ప్రభావం తన ప్రొఫెషనల్‌ కెరీర్‌పై పడకుండా జాగ్రత్త పడుతోంది. ఇందులో భాగంగా వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో వీటి రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పుడున్న ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించిన సామ్‌…తన స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్‌ శిల్పారెడ్డితో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలు దేరింది. ఈ నేపథ్యంలో తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తాజాగా తన ఛార్‌దామ్‌ యాత్రను ముగించుకున్న ఈ ముద్దుగుమ్మ..తన యాత్రా విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది.

అద్భుతమైన యాత్ర ముగిసింది.. ఈ సందర్భంగా శిల్పారెడ్డితో కలిసిన ఫొటోను పోస్ట్‌ చేసిన సామ్‌…’ అద్భుతమైన యాత్ర ముగిసింది. నా హృదయంలో హిమాలయాలకు ప్రత్యేక స్థానముంది. మహాభారతంలో చదివినప్పటి నుంచి ఎప్పటికైనా వీటిని సందర్శించాలని ఉండేది. ఎట్టకేలకు నేను కోరుకున్నట్లే దేవతలు కొలువైన ఈ అందమైన భూలోక స్వర్గాన్ని చూశాను. నా ఆధ్యాత్మిక యాత్ర ఎంతో ఉత్కంఠగా సాగింది’ అని రాసుకొచ్చింది. దీనికంటే ముందు రుషికేష్‌కు వెళ్లిన సామ్‌ అక్కడి ప్రఖ్యాత మహర్షి మహేష్‌ యోగి ఆశ్రమాన్ని సందర్శించింది. ‘ ది బీటెల్స్‌( ఇంగ్లిష్‌ రాక్‌ బ్యాండ్‌) నడిచిన చోట నేను అడుగుపెట్టాను. తమ పాటలతో ధ్యానాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన మహర్షి మహేష్‌ యోగి ఆశ్రమాన్ని సందర్శించాను’ అక్కడ దిగిన పలు ఫొటోలను పంచుకుంంది.   అంతకుముందు ‘ఛార్‌దామ్‌ టూర్‌..బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవర్‌’ అంటూ సామ్‌తో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది శిల్పారెడ్డి.   చైతూతో విడాకులు, యూట్యూబ్‌ ఛానెళ్లపై కేసులు..తదితర సంఘటనలతో మానసికంగా కుంగిపోయిన సమంత…వాటి నుంచి బయటపడేందుకే ఇలా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Also read:

Happy Birthday Prabhas: నేడు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫ్యాన్స్

IPL 2022: ఐపీఎల్ పోటీలోకి మ‌రో బాలీవుడ్ జంట ఎంట్రీ..! షారుఖ్, ప్రీతిజింటాల‌కు గ‌ట్టి పోటీ..

Deepika Pilli: చిలకపచ్చ ఓణీతో పరువాల వల వేస్తున్న వయ్యారి భామ దీపికా పిల్లి..