AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: 'మా' పై లేటైనా లేటెస్ట్ గా స్పందించిన రాము.. తనదైన స్టైల్ లో.. (వీడియో)

MAA Elections 2021: ‘మా’ పై లేటైనా లేటెస్ట్ గా స్పందించిన రాము.. తనదైన స్టైల్ లో.. (వీడియో)

Anil kumar poka
|

Updated on: Oct 23, 2021 | 9:55 AM

Share

ఈనెల 10న జరిగాయి ‘మా’ ఎలక్షన్స్. ఎన్నికలకు ముందు ఎంత రచ్చ జరిగిందో చూశాం. లోకల్-నాన్ లోకల్, పొలిటికల్ లీడర్స్ సపోర్ట్.. కులాల కుంపట్లు, వ్యక్తిగత ఆరోపణలు, డబ్బులు పంపకం… ఇలా రకరకాలు అంశాలు తెరపైకి వచ్చాయి.

ఈనెల 10న జరిగాయి ‘మా’ ఎలక్షన్స్. ఎన్నికలకు ముందు ఎంత రచ్చ జరిగిందో చూశాం. లోకల్-నాన్ లోకల్, పొలిటికల్ లీడర్స్ సపోర్ట్.. కులాల కుంపట్లు, వ్యక్తిగత ఆరోపణలు, డబ్బులు పంపకం… ఇలా రకరకాలు అంశాలు తెరపైకి వచ్చాయి. ఎన్నికల తర్వాత అయినా పరిస్థితులకు కుదటపడతాయి అనుకున్నాం. అయితే రిజల్ట్స్ తర్వాత వేడి మరింత పెరిగింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఎన్నికల రోజు ఏకంగా మోహన్ బాబు అండ్ కో రౌడీయిజం చేశారన్నది ప్రకాష్‌రాజ్ టీమ్‌ ఆరోపణ. మోహన్‌బాబు, నరేష్‌ భౌతిక దాడులకు దిగారాని, బండబూతులు తిట్టారని చెబుతున్నారు. ఏకంగా ప్రెస్‌మీట్‌ పెట్టిమరీ ఇదేవిషయం చెప్పారు. కౌంటింగ్‌ జరిగిన తీరుపైనా డౌట్స్ రైజ్‌ చేశారు. రాత్రి గెలిచాం..ఉదయానికి ఓడిపోయాం అంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు.

అయితే ఈ ఆరోపణలకు సాక్ష్యాలు కూడా ఉన్నాయంటోంది ప్రకాష్‌రాజ్‌ టీమ్. సీసీఫుటేజ్ ఇస్తే అన్ని విషయాలు బయటపడుతాయన్నది వారి వాదన. మరి ఇచ్చేందుకు ఎలక్షన్ ఆఫీసర్‌కు ఉన్న అభ్యంతరాలేంటి అన్నది తేలాల్సి ఉంది..మొత్తానికి ‘మా’ సినిమా ఇంకా ముగియలేదు. ఇదిలా ఉంచితే.. తనకు సంబంధం ఉన్నా, లేకపోయినా అన్ని అంశాల్లో ‘ట్వీటు’ పెట్టే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇంత రచ్చ జరుగుతున్నా కనీసం స్పందించలేదు. అప్పుడెప్పుడో లోకల్, నాన్-లోకల్ అంశపై ఓ సెటైరికల్ ట్వీట్ వేసి లైట్ తీసుకున్నారు.

తాజాగా రాము తీరిగ్గా ఓ ట్వీట్ వేశారు. లేటుగా చేసినా ‘మా’ పరిణామాలపై తన వెర్షన్‌ను ఒక్క మాటలో తేల్చేశారు. ‘మా’లోని మొత్తం వ్యవహారం చూస్తుంటే సర్కస్‌ని తలపించేలా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. ఆర్జీవీ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Published on: Oct 23, 2021 07:54 AM