Yashoda Teaser: సామ్ నటనకు సలాం చేయాల్సిందే..ఆసక్తి రేపుతోన్న “యశోద” టీజర్..
స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ యశోద. లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ యశోద. లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఈచిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోండగా.. హరి–హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ తో సినిమాలో ఏదో ఇంట్రెస్టింగ్ లైన్ ఉందని అందరిలోనూ అనిపించేలా ఆసక్తిని పెంచేశారు. దాంతో సమంత యశోద సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ లో సమంత గర్భవతి పాత్రలో కనిపించనుంది. టీజర్ లో డాక్టర్ సమంతను గర్భవతిగా ఉన్నప్పుడు ఏ ఏ పనులైతే చేయదని చెప్తుందో సమంత అలాంటి పనులే చేస్తుంది. ఆమెను ఎవరో చంపడానికి ప్రయత్నించడం.. వాళ్ళ నుంచి సామ్ తప్పించుకోవడం.. విలన్స్ తో పోరాడటం ఈ టీజర్ లో చూపించారు. అసలు సమంతకు ఏమైంది.? ఆమెను ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారు..? అనేది ఆసక్తికరంగా ఉంది.
Strength, willpower & adrenaline!https://t.co/Dv8OQkBntW#YashodaTheMovie @Samanthaprabhu2 @Iamunnimukundan @varusarath5 @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial @DoneChannel1 @SanchitaTrivedi @PRO_SVenkatesh @DiljithAthira
— Samantha (@Samanthaprabhu2) September 9, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.