Nenu Meeku Baaga Kavalsinavaadini : నేను మీకు బాగా కావాల్సినవాడిని ట్రైలర్ వచ్చేసింది… ఊర మాస్ లుక్‎లో అదరగొట్టిన కిరణ్ అబ్బవరం..

కూతురు ప్రేమించినవాడిని కదా.. నన్ను మెతక అనుకుంటున్నావేమో.. కాస్ట్యూమ్, కళ్లజోడు చూస్తే అర్థం కావట్లేదా ? మాస్ ఊరమాస్ అంటూ కిరణ్

Nenu Meeku Baaga Kavalsinavaadini : నేను మీకు బాగా కావాల్సినవాడిని ట్రైలర్ వచ్చేసింది... ఊర మాస్ లుక్‎లో అదరగొట్టిన కిరణ్ అబ్బవరం..
Kiran Abbavaram
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 08, 2022 | 7:57 PM

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇటీవలే సమ్మేతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ (Kiran Abbavaram) ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని (Nenu Meeku Baaga Kavalsinavaadini). డైరెక్టర్ శ్రీధర్ గాదె రూపొందించిన ఈ మూవీలో సోనూ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. మాస్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్‏ను గురువారం సాయంత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేశారు. మొదటిసారి ఊర మాస్ లుక్‏లో అదరగొట్టారు కిరణ్ అబ్బవరం. నీ కూతురు ప్రేమించినవాడిని కదా.. నన్ను మెతక అనుకుంటున్నావేమో.. కాస్ట్యూమ్, కళ్లజోడు చూస్తే అర్థం కావట్లేదా ? మాస్ ఊరమాస్ అంటూ కిరణ్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి.

అంతేకాకుండా చాలా కాలం తర్వాత డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాతో వెండితెరపై సందడి చేయనున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి, కిరణ్ అబ్బవరం, బాబా భాస్కర్ మధ్య వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో గెటప్ శ్రీను, బాబా భాస్కర్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తనయ దివ్య నిర్మించగా.. మణిశర్మ సంగీతం అందించారు. ఈ మూవీ సెప్టెంబర్ 16న విడుదల కానుంది.

ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.