దుస్తులు కొనుక్కోడానికి కూడా డబ్బులు లేవంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటి..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు ఎప్పుడు పాపులర్ అవుతున్నారో చెప్పలేకపోతున్నాం.. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సెటిల్ అయ్యారు.

దుస్తులు కొనుక్కోడానికి కూడా డబ్బులు లేవంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటి..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 09, 2022 | 11:34 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు ఎప్పుడు పాపులర్ అవుతున్నారో చెప్పలేకపోతున్నాం.. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సెటిల్ అయ్యారు, సెలబ్రెటీలయ్యారు. గ్లామర్ తో ఫ్యాలోయింగ్ ను పెంచుకున్న వారుకూడా ఉన్నారు. డాన్స్ వీడియోలు, షార్ట్ ఫిలిం లు అంటూ చాలా మంది పాపులర్ అవుతున్నారు. కొంతమంది ఏకంగా సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. మరికొంతమంది బిగ్ బాస్ లాంటి గేమ్ షోల్లో ఛాన్స్ కొట్టేశారు. ఈ అమ్మడు కూడా అలానే పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది. ఆ అమ్మడు ఎవరో కాదు బాలీవుడ్ భామ ఉర్ఫీజాదవ్.

ఉర్ఫీజాదవ్ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది. వింత వింత డ్రస్సులతో ఫోటోలకు ఫోజులిస్తూ వైరల్ అయ్యింది ఈ భామ. తాడులు, బ్లేడ్లు, పీచుమిఠాయి, ప్లాస్టిక్ కవర్స్, పగిలిన గాజు ముక్కలు.. ఇలా ఏది దొరికితే దాన్ని డ్రస్సు గా మార్చుకొని ఫోటోలు దిగుతుంది ఈ బ్యూటీ. అంతే కాదు అమ్మడు ఎక్స్ పోజింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. తాజాగా ఓ ఇంట్రవ్యూలో పాల్గొన్న ఉర్ఫీ ఆసక్తికర విషయాలను పంచుకుంది. బిగ్ బాస్ షో కు వెళ్ళాక ముందు చాలా ఇబ్బందులు పడిందట. దాదాపు ఎనిమిదేళ్లు డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నా అని తెలిపింది. .అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు తనకు కనీసం సరైన బట్టలు లేవని తెలిపింది.  పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాను.. ఆ షోలో వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు ఆసమయంలో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి
Urfi Javed

Urfi Javed

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.