Pushpa: పుష్ప క్రేజ్ తగ్గేదే లే.. గణేష్ మండపంలో ప్రత్యక్షమైన పుష్పరాజ్.. వీడియో వైరల్

అల్లు అర్జున్ నటించిన పుష్ప(Pushpa)సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Pushpa: పుష్ప క్రేజ్ తగ్గేదే లే.. గణేష్ మండపంలో ప్రత్యక్షమైన పుష్పరాజ్.. వీడియో వైరల్
Pushpa
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 09, 2022 | 12:05 PM

అల్లు అర్జున్ నటించిన పుష్ప(Pushpa)సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ నటన, లుక్ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ ఆయిన పుష్ప సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలించి. బాలీవుడ్ లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించగా సునీల్ మరో నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక పుష్ప సినిమా రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

తాజాగా గణేష్ విగ్రహాల్లోనూ వినాయకుడి విగ్రహాలని పుష్ప సినిమా గెటప్స్ లో తయారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ప్రజలు గణేష్ చతుర్థిని సరికొత్త పద్ధతులలో జరుపుకుంటున్నారు. ముంబైలోని ఖేత్వాడీలో గణేష్ పండల్‌లలో పుష్ప థీమ్‌ను చాలా సృజనాత్మకంగా క్రియేట్ చేశారు. ఇందులో పుష్ప రాజ్ గెటప్ లో ఉన్న ఒక బొమ్మ పై నుంచి కిందికి దిగుతూ.. పుష్ప సినిమా డైలాగ్ చెప్తుంది.. ఆ తర్వాత రిమోట్ సాయంతో ఆ బొమ్మ వినాయకుడి విగ్రహంకు ఉన్న ముసుగును తొలగిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.