AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ‘పెళ్లి విఫలమయ్యింది.. కష్టాలు చుట్టుముట్టాయి.. రెండేళ్లుగా పోరాడుతున్నాను’.. సమంత కామెంట్స్..

భూటాన్‏లో మయోసైటిస్ చికిత్స కోసం సిద్ధమవుతుంది. అక్కడ హాట్‌స్టోన్ బాత్ అనే ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ కోసం ఈ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా హర్పర్ బజార్ అనే ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది సామ్. జీవితంలో ఎన్నో కష్టాలు చుట్టుముట్టాయని.. పెళ్లి విఫలమవ్వడం.. ఆరోగ్య సమస్యలు.. సినిమాలు ప్లాప్ కావడం తనను ఎంతో ఇబ్బందికి గురిచేశాయని చెప్పుకొచ్చింది.

Samantha: 'పెళ్లి విఫలమయ్యింది.. కష్టాలు చుట్టుముట్టాయి.. రెండేళ్లుగా పోరాడుతున్నాను'.. సమంత కామెంట్స్..
Samantha
Rajitha Chanti
| Edited By: |

Updated on: Nov 09, 2023 | 4:14 PM

Share

గత రెండేళ్లుగా సమంత ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి తెలిసిందే. ఓవైపు ప్రేమ, పెళ్లి విఫలం కావడంతో మానసిక సంఘర్షణ.. మరోవైపు మయోసైటిస్ సమస్యతో ఎంతో ఇబ్బంది పడింది. సినిమా చిత్రీకరణకు బ్రేక్ తీసుకుని ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంది. ఆ తర్వాత కాస్త కోలుకోగానే ఖుషి, సిటాడెల్ చిత్రాలను పూర్తి చేసింది. ఖుషి సినిమా షూటింగ్ సమయంలోనే మరోసారి మయోసైటిస్ సమస్య వేధించడంతో ఈ మూవీ విడుదలకు ముందే చికిత్స కోసం విదేశాలకు వెళ్లిపోయింది. కొన్ని నెలల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్న సామ్.. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. ఇప్పుడు ఆమె భూటాన్‏లో మయోసైటిస్ చికిత్స కోసం సిద్ధమవుతుంది. అక్కడ హాట్‌స్టోన్ బాత్ అనే ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ కోసం ఈ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా హర్పర్ బజార్ అనే ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది సామ్. జీవితంలో ఎన్నో కష్టాలు చుట్టుముట్టాయని.. పెళ్లి విఫలమవ్వడం.. ఆరోగ్య సమస్యలు.. సినిమాలు ప్లాప్ కావడం తనను ఎంతో ఇబ్బందికి గురిచేశాయని చెప్పుకొచ్చింది.

మీరు జీవితంలో మంచి చెడుల గురించి చాలా ఓపెన్ గా ఉంటారు. మీ ఆలోచనలు ఏమైనా పంచుకుంటారా ? అని అడగ్గా.. సమంత మాట్లాడుతూ.. ” నేను ఒక నటిగా గుర్తింపు తెచ్చుకున్నాను. కానీ అదే సమయంలో నా వైవాహిక జీవితం ముగిసిపోయింది. ఆరోగ్యం దెబ్బతిన్నది. అది నా పని మీద ప్రభావితం చూపించింది. దీంతో సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఈ మూడు నా జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు. గత రెండు సంవత్సరాలుగా నేను భరించిన దానికంటే చాలా తక్కువగా ప్రజలు దిగజారుతున్నారు. ఎన్నో కష్టాలు ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి. ఓవైపు ఆరోగ్య సమస్యలు.. మానసిక సంఘర్షణకు గురవుతున్న సమయంలోనే నటీనటుల గురించి ట్రోలింగ్స్, నెగిటివ్ వార్తలు వచ్చాయి. ఆ సమయంలో నేను ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి గురించి.. లేదా ట్రోలింగ్ లేదా ఆందోళనకు గురైన వారి గురించి చదివాను. వారి కథలు చదవడం నాకు సహాయపడింది. వాళ్లు ఎదుర్కొన్నారు నేను ఎదుర్కొగలను అని నేను అనుకున్నాను. అదే నాకు బలాన్నిచ్చింది.

ఈ దేశంలో అభిమాన హీరోయిన్‏గా ఉండటం నాకు అద్భుతమైన బహుమతి. ఆ గుర్తింపు పట్ల నాకు ఒక బాధ్యత. అందుకే నిజాయితీగా, వాస్తవికంగా ఉండండి. మీ కథను చెప్పండి. ఎవరైనా ఎన్ని సూపర్ హిట్‌లు, బ్లాక్‌బస్టర్‌ సినిమాలు చేశారు, ఎన్ని అవార్డులు గెలుచుకున్నారు, ఎంత అందంగా రెడీ అవుతున్నారు అని కాకుండా.. వారి బాధలు, కష్టాలు తెలుసుకోండి. నా సమస్యల గురించి ప్రజలకు తెలుసు అని నేను పట్టించుకోను. నిజానికి ఆ కష్టాలే నాకు బలం. నా శక్తిమేరకు నేను పోరాడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిఒక్కరికి పోరాడే శక్తి ఉంటుందని నేను ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది సమంత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.