AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : అవును ఆ విషయంలో నేను తప్పు చేశాను.. ఓపెన్ అయిన సమంత

తెలుగులో చివరిగా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సామ్. ఆతర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది. అక్కడ స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది.

Samantha : అవును ఆ విషయంలో నేను తప్పు చేశాను.. ఓపెన్ అయిన సమంత
Samantha
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2024 | 4:42 PM

Share

స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడెప్పుడు సినిమాలు చేస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మాయోసైటిస్ తో బాధపడుతున్న సామ్ దాన్ని నుంచి కోలుకోవడానికి ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తెలుగులో చివరిగా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సామ్. ఆ తర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది. అక్కడ స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది. హిందీలో ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేసింది. దాంతో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇదికూడా చదవండి :Rambha: సౌందర్య నా బెస్ట్ ఫ్రెండ్.. ఆ హీరోయిన్స్‌కు యాటిట్యూడ్ ఎక్కువంటున్న రంభ

ఇక సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్ సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. అప్పుడప్పుడూ కొటేషన్స్ పెడుతూ.. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే అభిమానులతోనూ ముచ్చటిస్తుంది సామ్. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. నెటిజన్ అడిగిన ప్రశ్నకు అవును నేను తప్పు చేశాను అని ఒప్పుకుంది సామ్.

ఇదికూడా చదవండి : Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ.. ఇక రచ్చ రంబోలానే

అనేక మంచి విషయాలు మీరు బాగానే చెబుతారు. కానీ, మీరే ఆరోగ్యానికి హానికరమైన బ్రాండ్స్‌ని కూడా ప్రమోట్ చేశారు అని సామ్ ను అడిగాడు. దానికి సామ్ స్పందిస్తూ.. అవును గతంలో నేను తప్పులు చేశాను అని ఒప్పుకుంది. కానీ అవి కావాలని చేసిన తప్పులు కావు. వాటి గురించి తెలిసిన తర్వాత ఆ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం ఆపేశాను అని తెలిపింది. ప్రస్తుతం తాను ఏదైతే చేస్తున్నానో వాటిని మాత్రమే ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపింది సామ్. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ అయ్యుండి తప్పును సమర్ధించుకోకుండా నిజాయితీగా ఒప్పుకుంది అంటూ సామ్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ఇటీవలే బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది. అలాగే హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుందని తెలుస్తోంది.

 సమంత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే