AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rambha: సౌందర్య నా బెస్ట్ ఫ్రెండ్.. ఆ హీరోయిన్స్‌కు యాటిట్యూడ్ ఎక్కువంటున్న రంభ

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. అప్పట్లో ఉన్న స్టార్ హీరోయిన్స్ కు పోటీగా రంభ రాణించింది.

Rambha: సౌందర్య నా బెస్ట్ ఫ్రెండ్.. ఆ హీరోయిన్స్‌కు యాటిట్యూడ్ ఎక్కువంటున్న రంభ
Soundarya , Rambha
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2024 | 3:09 PM

Share

ఒకప్పుడు అందం, నటనతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో రంభ ఒకరు. అప్పట్లో ఈ అమ్మడు ఓ ఊపు ఊపేసింది. ఈ బ్యూటీ కోసం కుర్రాళ్ళు థియేటర్స్ ముందు క్యూ కట్టేవారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. అప్పట్లో ఉన్న స్టార్ హీరోయిన్స్ కు పోటీగా రంభ రాణించింది. చిన్న చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోలు, సీనియర్ హీరోల వరకు అందరి సరసన నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది

ఇదికూడా చదవండి : Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ.. ఇక రచ్చ రంబోలానే

హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. అడపాదడపా స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లాంటి హీరోలతో స్పెషల్ సాంగ్స్ చేసి అదరగొట్టింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది రంభ. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనించి హ్యాపీ లైఫ్ గడుపుతుంది. ఇదిలా ఉంటే గతంలో రంభ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తనకు రమ్యకృష్ణ అంటే చాలా భయం అని చెప్పింది రంభ. అలాగే సౌందర్య గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇదికూడా చదవండి : ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు పిచ్చెక్కించేలా

ఇండస్ట్రీలో తనకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే అది సౌందర్య అని తెలిపింది రంభ.. సౌందర్య నేను చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం.. ఆమె అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది రంభ. అలాగే నటి మహేశ్వరీ  కూడా తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పింది. ఇక హీరోయిన్స్ లో తనకు ఎవరితో కలిసి నటించడం కష్టంగా అనిపించింది.? అనే ప్రశ్నకు అంటే రమ్యకృష్ణ పేరు చెప్పింది రంభ. ఆమె తో కలిసి నటించాలంటే నాకు చాలా భయం. రమ్యకృష్ణ అవలీలగా డైలాగ్ చెప్పేస్తుంది.. ఎలాంటి సేన్ అయినా ఇట్టే చేసేస్తుంది. నేను ఆమెకంటే జూనియర్ కావడంతో ఆమెతో కలిసి నటించడం కష్టంగా , భయంగా అనిపించేది అని తెలిపింది రంభ. అలాగే ఇప్పుడున్న హీరోయిన్స్ లో త్రిష అంటే ఇష్టమని ఆమె చాలా బాగా మాట్లాడుతుంది. మిగిలిన హీరోయిన్స్ అలా కాదు కొంచం యాటిట్యూడ్ చూపిస్తారు. చూసి చూడనట్టు వెళ్ళిపోతారు అని తెలిపింది రంభ. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే