AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harsha Sai: బట్టబయలైన హర్షసాయి బాగోతం.. ఇలా నిన్ను అస్సలు అనుకోలే

ఇటీవల కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లయోన్సర్‌లు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి.. అమాయకులను నట్టేట ముంచుతున్నారు. బెట్టింగ్ యాప్స్ భారీ అమౌంట్ ఆఫర్ చేస్తూ ఉండటంతో... . ఏ మాత్రం బాధ్యత లేకుండా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు కొందరు.

Harsha Sai: బట్టబయలైన హర్షసాయి బాగోతం.. ఇలా నిన్ను అస్సలు అనుకోలే
Harsha Sai
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 29, 2024 | 4:10 PM

సోషల్ మీడియాలో కొద్దో గొప్పో ఫేమ్ తెచ్చుకోవడం.. ఆపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం… ఈ మధ్య ఈ కల్చర్ బాగా పెరిగిపోయింది. అక్రమ పద్దతితో 100 రూపాయలు సంపాదించి.. 10 రూపాయలు పేదలకు పంచుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు కొందరు. ఈ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది బలైపోతున్నారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ యాప్స్ ప్రమోట్ చేసేవారిలో కొందరు టీవీ, సినీ ఆర్టిసులుకు కూడా ఉంటున్నారు. ఇలాంటి బ్యాచ్‌ను గత కొద్ది రోజులుగా ఏకిపారేశాడు యువసామ్రాట్ అనే వ్యక్తి. దీంతో కన్నాల్లో నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్లు కొందరు బయటకు వచ్చి తమ తప్పు ఏం లేదని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రముఖ  యూట్యూబర్ హర్హసాయి కూడా ఉండటం గమనార్హం.

హర్షసాయికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 6.5 మిలియన్ల మంది అతన్ని అనుసరిస్తున్నారు. ఈ లెక్కన దేశంలోనే నంబర్ 1 యూట్యూబర్ అని కూడా చెప్పవచ్చు. తాను సంపాదించిన సొమ్ములో.. కొంత పేదలకు పంచి పెడుతూ పాపులారిటీ పొందిన హర్షసాయిని విమర్శలు చుట్టుముడుతున్నాయి. జనాల ప్రాణాలను మింగేస్తున్న.. అక్రమ బెట్టింగ్ యాప్స్‌ను అతను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్లు యువసామ్రాట్ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తూ వస్తున్నారు. హర్షసాయి చేసిన ప్రమోషన్ వల్ల ఎంతోమంది..టీనేజర్స్, యూత్ సర్వం కోల్పోయారని యూవసామ్రాట్ బలంగా వాదిస్తున్నారు. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలు ఖండించే క్రమంలో.. హర్షసాయి అపరిపక్వంగా కామెంట్స్ చేశాడు.

తాను చాలా తక్కువగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు హర్షసాయి చెబుతున్నాడు. “నా దగ్గరకు కొందరు అప్రోచ్ అవుతారు.. నేను చేయనంటే మరొకరి దగ్గరికి వెళ్తారు. వాళ్లనూ ఆపితే.. యూట్యూబ్‌లో డైరెక్ట్ యాడ్స్ వేసుకుంటారు.  బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేస్తే.. ఈ ప్రమోషన్స్ అసలు ఉండవ్ కదా. సిస్టమ్‌లో ఉన్న లూప్స్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్‌లను లీగల్‌గానే వారు ఆపరేట్ చేస్తున్నారు. నేను బ్యాన్ చేసిన యాప్స్ ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేసినా కూడా అన్ని జాగ్రత్తలు చెబుతా. ఇన్ డైరెక్ట్‌‌గా, బాధ్యతగా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా. కొందరు అయితే బెట్టింగ్ వేసేలా ఇన్‌ప్లూయెన్స్ చేస్తారు. నా ప్రమోషన్ విధానం ద్వారా బెట్టింగ్ ఆడేవాళ్ల సంఖ్యని తగ్గించగలిగాను. ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బును కూడా నేను సోషల్ సర్వీస్ చేయడానికే వాడుతున్నాను. ఈ లెక్కన నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడమే తప్పు అవుతుంది” అంటూ ఏదో తికమకగా తన వివరణ ఇచ్చాడు హర్షసాయి.

బెట్టింగ్ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. డబ్బులు వస్తాయని ఆశపడి.. ఆస్తులు అమ్మి.. అప్పులు చేసి.. కొందరు నాశనం అయిపోతున్నారు. రోజూ ఇలాంటి వార్తలు బోలెడు వింటున్నాం. ఒక్కసారి బెట్టింగ్ బారిన పడితే.. జీవితం నాశనమే.. అలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ హర్షసాయి ఇచ్చిన సమాధానం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. పేదలకు సాయం చేయడంలో ముందు ఉండే నిన్ను అందరూ అభినందిచాల్సిన విషయమే. కానీ ఇలా బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోట్ చేయడం మాత్రం సమర్ధనీయం కాదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.