Samantha: మరోసారి కొండా సురేఖ వివాదంపై స్పందించిన సమంత.. వారి సపోర్ట్ లేకుండా ఉంటే..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల సమంత, నాగచైతన్య విడాకుల గురించి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె మాటలను తప్పుబడుతూ మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరమ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి వంటి స్టార్స్ సీరియస్ అయ్యారు. మరోవైపు కొండా సురేఖపై నాగార్జున కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.

Samantha: మరోసారి కొండా సురేఖ వివాదంపై స్పందించిన సమంత.. వారి సపోర్ట్ లేకుండా ఉంటే..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 17, 2024 | 10:34 AM

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. చైతన్య, సమంత విడిపోవడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్ అంటూ కొండా సురేఖ కామెంట్స్ చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీపై ఆమె పై మండిపడింది. తమ రాజకీయాల కోసం సినీతారల వ్యక్తిగత విషయాల గురించి నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని సినీ ప్రముఖులు, హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. మరోవైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పై రియాక్ట్ అయిన నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే కొండ సురేఖ వ్యాఖ్యలపై మరోసారి హీరోయిన్ సమంత స్పందించారు.

చాలా కాలం తర్వాత సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు రాబోతుంది సమంత. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న సామ్.. మరోసారి కొండ సురేఖ వివాదంపై రియాక్ట్ అయ్యింది. సౌత్ ఇండస్ట్రీలోని చాలా మంది సినీ నటీనటులు తనకు మద్దతుగా నిలిచారని… వారందరి సపోర్ట్ కారణంగానే ఇప్పుడు తాను ఇక్కడ ఉన్నానని చెప్పుకొచ్చింది.

“నా గురించి ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు సౌత్ ఇండస్ట్రీ మొత్తం నావైపు నిలబడింది. వారందరూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. వారి ప్రేమ, సపోర్ట్ కారణంగానే ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను. ఇండస్ట్రీతోపాటు నా ప్రజలు కూడా నన్ను వదులుకోలేదు. వారి ప్రేమ, నాపై ఉన్న విశ్వాసమే ఈ వివాదం నుంచి త్వరగా బయటకు వచ్చేలా చేసింది. పరిశ్రమ నాకు సాయం చేయకుండా ఉండుంటే దీని గురించి కోలుకోవడానికి చాలా సమయం పట్టేది. ఇలాంటి సమయంలో వారే లేకుంటే నేను మరింతగా కుంగిపోయేదాన్ని. అందరి మద్దతు వల్లే నేను ఇక్కడ తిరిగి మీ ముందుకు కూర్చున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది సమంత.

ఇది చదవండి : Devara Movie: సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తోన్న ‘దేవర’ సిన్నది.. బ్లాక్ శారీలో మైండ్ బ్లాంక్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.