Samantha: అఖిల్ వీడియోపై క్రేజీ కామెంట్ చేసిన సమంత.. అక్కినేని హీరో రియాక్షన్ ఏంటంటే..
ఎప్పుడూ అక్కినేని ఫ్యామిలీ గురించి స్పందించని సామ్.. తాజాగా అక్కినేని అఖిల్ షేర్ చేసిన ఓ వీడియో పై క్రేజీ కామెంట్ చేసింది.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. కొద్దిరోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న ఆమె.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇటీవలే సిటాడెల్ చిత్రీకరణలో జాయిన్ అయ్యింది. అటు నిత్యం నెట్టింట మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తూ.. తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి పరోక్షంగా ప్రస్తావించింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. ఇందుకు కారణం ఆమె అక్కినేని అఖిల్ మూవీ టీజర్ పై స్పందించడమే. అక్కినేని నాగచైతన్యను 2017లో పెళ్లి చేసుకున్న సామ్.. 2021లో విడాకులు ఇచ్చారు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వీరిద్దరు విడిపోవడం మాత్రం అభిమానులకు పెద్ద షాకిచ్చింది. ఈ లవ్ బుల్ కపుల్ మళ్లీ కలిస్తే చూడాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికీ నెట్టింట మీరు కలవండి అంటూ కామెంట్స్ పెడ్తుంటారు. అయితే ఎప్పుడూ అక్కినేని ఫ్యామిలీ గురించి స్పందించని సామ్.. తాజాగా అక్కినేని అఖిల్ షేర్ చేసిన ఓ వీడియో పై క్రేజీ కామెంట్ చేసింది.
అక్కినేని అఖిల్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఏజెంట్. ఈ సినిమాకు డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు.ఇందుకు సంబంధించిన ఓ పవర్ ఫుల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ వీడియోను అఖిల్ తన ఇన్ స్టాలో షేర్ చేయగా.. దీనికి సమంత లైక్ కొట్టింది. అలాగే బీస్ట్ మోడా ఆన్ ఫైర్ అంటూ కామెంట్ చేసింది. అయితే సామ్ కామెంట్ పై అఖిల్ ఇంకా స్పందించలేదు. దీంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
అయితే సామ్.. చైతూ విడిపోయిన తర్వాత గతేడాది ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పాడు అఖిల్. గతంలో సామ్ సినిమాలపై అఖిల్ కామెంట్ చేశారు. ఇటీవలే శాకుంతలం సినిమా పోస్ట్ ను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు సుశాంత్. కానీ అక్కినేని హీరో పోస్ట్ కు సామ్ స్పందించడం ఇదే తొలిసారి. దీంతో అక్కినేని కుటుంబంతో సమంతకు ఇప్పటికీ మంచి రిలేషన్ ఉన్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.