Samantha: జెస్సీ నుంచి యశోద వరకు.. తెలుగు ప్రేక్షకుల మనసులో లేడీ సూపర్ స్టార్.. సమంత బర్త్ డే స్పెషల్..
సమంత.. (Samantha)ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలోనే అగ్రకథానాయిక.. పదేళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా వరుస

సమంత.. (Samantha)ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలోనే అగ్రకథానాయిక.. పదేళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఏమాయ చేశావే అంటూ తెలుగు ప్రేక్షకులను తన నటనతో మాయ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత దూకుడు పెంచింది. ఈగతో ప్రేమాయణం నడిపి.. ఎటో వెళ్లిపోయింది మనసు అంటూ కురాళ్ల మనసు దొచుకుంది. ఆరడుగులు ఉంటాడా అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబుతో ఆడిపాడింది. దాదాపు పదేళ్లకు పైగా కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అత్తారింటింకి దారేది… రామయ్య వస్తావయ్యా, రభస, అఆ, మహానటి, యూటర్న్, ఓబేబీ, జాను వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేసిన సమంత.. ఆ సమయంలోనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది.
ఓవైపు తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నీదానే ఎన్ పొన్వసంతం సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది సామ్. ఇక హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్‌లో రాజీ పాత్రలో నటించి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. దక్షిణాదిలోనే కాకుండా.. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులలో ఫాలోయింగ్ అందుకుంది.
సమంత.. 1987లో ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించింది. తెరపైనే కాదు.. తెర వెనక కూడా తన మంచి మనసును చాటుకుంటుంది సమంత.. ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది పేద పిల్లలకు గుండె జబ్బులకు చికిత్స చేయిస్తుంది. ఏమాయ చేశావే సినిమా సమయంలోనే హీరో అక్కినేని నాగచైతన్యకు.. సమంత మధ్య ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. పదేళ్ల ప్రేమ తర్వాత.. 2017 అక్టోబర్ 9న సామ్, చైతూ గోవాలో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బ్యూటీఫుల్ కపూల్స్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట అనుహ్యంగా అక్టోబర్ 2న 2021లో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం సామ్.. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది..సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు.. యశోధ సినిమా షూటింగ్ దశలో ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
KGF 2 Yash: కేజీఎఫ్ 3 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాఖీభాయ్.. సెకండ్ పార్ట్‌కు మించి ఉంటుందని..
