Samantha: పెళ్లి చేసుకున్న సమంత, రాజ్ నిడిమోరు.. ఇద్దరి ప్రేమకథ మొదలైందిలా..
హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడమోరు పెళ్లి చేసుకున్నారు. సోమవారం ఉదయం ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 30 మంది సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల వేడుక జరిగింది. సామ్ సమయం దొరికినప్పుడల్లా ఈషా సెంటర్‌కి వెళ్తుంటారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంటారు.

సమంత – రాజ్‌పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ముహూర్తం కుదిరింది. వేదిక ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తాయి. వాటిని నిజం చేస్తూ సామ్ పెళ్లి చేసుకున్నారు. ఇవాళ ఉదయం 7 గంటలకు రాజ్ నిడిమోరు భాగస్వామి అయ్యారు. . సామ్ అమితంగా నమ్మే ఈషా సెంటర్ వీరి వివాహానికి వేదికైంది. ఎరుపు రంగు చీరలో పెళ్లి కూతురుగా ముస్తాబైంది సమంత. దాదాపు 30 మంది సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల వేడుక జరిగింది. సామ్ సమయం దొరికినప్పుడల్లా ఈషా సెంటర్‌కి వెళ్తుంటారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంటారు. ఈ ప్రాంతంతో ఆమె ప్రత్యేకమైన అనుబంధం ఉందని, దాంతో అక్కడే పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి గురించి సమంతగానీ, రాజ్ నిడిమోరుగానీ ఇప్పటిదాకా ఎక్కడా నోరు విప్పలేదు. ఇద్దరూ సైలెంట్‌గానే ఉన్నారు. అయితే, రాజ్ నిడిమోరు మాజీ భార్య షామాలీ పెట్టిన పోస్టు ఈ వార్తలకు బలం చేకూర్చింది. ‘తెగించిన వ్యక్తులు దానికి తగ్గట్టుగానే తెగింపుతో వ్యవహరిస్తారు’ అంటూ ఇవాళ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు షామాలీ. కోట్ చేసినట్టుగానే ఉన్నప్పటికీ, ఇది సామ్ – రాజ్ వివాహానికి సంబంధించిందేననే మాటలు ఊపందుకున్నాయి.
‘ఫ్యామిలీమేన్’ సీరీస్ చేసినప్పటి నుంచీ సామ్‌కీ, రాజ్ నిడిమోరుకి పరిచయం ఉంది. వారి కాంబినేషన్‌లో ఈ మధ్య సిటాడెల్ కూడా విడుదలైంది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మండ్ సెట్స్ మీద ఉంది. ఈ సీరీస్ ఆగిపోయిందని వార్తలొచ్చాయి. కానీ, అలాంటిదేమీ లేదని మేకర్స్ స్పష్టం చేశారు. రాజ్ నిడిమోరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. డైరక్టర్‌గా, స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. డీకేతో కలిసి రాజ్ డీకేగా ప్రాజెక్టులు చేస్తున్నారు.
కెరీర్ తొలినాళ్లలోనే షామాలీ డేని వివాహం చేసుకున్నారు రాజ్. అయితే 2022లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ‘ఏమాయ చేసావె’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సమంత. ఆ సినిమా హీరో నాగచైతన్యను 2017లో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా హిందూ, క్రైస్టవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. అయితే, పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు 2021లో ప్రకటించింది ఈ జంట.
టాలీవుడ్ అందమైన జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో సంచలన వార్త. ఎందుకు విడిపోయారనే విశ్లేషణలు ప్రముఖంగా జరిగాయి. విడాకుల తర్వాత సమంత కెరీర్ మీద ఫోకస్ చేశారు. అయితే, యశోద సినిమా చేస్తున్న సమయంలో ఆమె మయోసైటిస్‌కి గురయ్యారు. అప్పటికప్పుడు నీరసపడిపోతున్నానంటూ మయోసైటిస్ గురించి అభిమానులతో పంచుకున్నారు. అంతే కాదు, ఆ వ్యాధి లక్షణాలు, దాన్ని నయం చేసుకోవడానికి పడుతున్న పాట్లు, చికిత్సా విధానం.. ఇలా ప్రతిదాన్నీ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు పంచుతూనే ఉన్నారు సామ్. ఈ క్రమంలోనే ఆమెకు రాజ్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. రాజ్ – సామ్ రిలేషన్ షిప్ గురించి రకరకాల వార్తలు మొదలయ్యాయి. సామ్ విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది రాజ్ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పడం కూడా అప్పట్లో వార్తల్లో నలిగింది.
ఆ తర్వాత సమంత ట్రాలాలా పిక్చర్స్ ని ప్రారంభించి శుభం మూవీ చేశారు. ఈ సినిమాకు రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. చెన్నై పికిల్ బాల్ టీమ్‌కి వీరిద్దరూ కో ఓనర్స్ గా వ్యవహరిస్తున్నారు. పికిల్ బాల్ ఈవెంట్లకు సామ్ వెళ్లినప్పుడు, ఆమె చెయ్యి పట్టుకుని రాజ్ నడిపించిన తీరు కూడా అప్పట్లో బాగా ఫ్లాష్ అయింది. ఆ మధ్య సమంత ప్రారంభించిన పెర్ఫ్యూమ్, పర్సనల్ కేర్ బ్రాండ సీక్రెట్ ఆల్కమిస్ట్ లాంచ్ ఈవెంట్‌కి రాజ్ అటెండ్ అయ్యారు.
పబ్లిక్‌గా కనిపించడానికి వీరిద్దరూ ఎప్పుడూ మొహమాటపడలేదు. సామ్ షేర్ చేసిన చాలా పిక్చర్స్ లో రాజ్ కనిపిస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లలోనూ ఇద్దరూ తరచుగా కనిపిస్తున్నారు. ఈ మధ్య సామ్ సొంత ఇల్లు కొనుగోలు చేశారు. ఆ గృహప్రవేశానికి సంబంధించిన పూజల్లో సామ్‌పక్కన రాజ్ ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి రాజ్ అని, అప్పటికే వీరిద్దరూ రిలేషన్‌ని చెప్పకనే చెప్పారని అన్నారు.
సామ్ – రాజ్ రిలేషన్ గురించి మీడియా చెప్పినదానికన్నా ఎక్కువగా రాజ్ మాజీ భార్య రియాక్ట్ అయిన సందర్భాలున్నాయి. ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా ఆమె చేసిన కామెంట్లు వారి రిలేషన్ షిప్‌ని కన్‌ఫర్మ్ చేసిందన్నది నెటిజన్ల మాట. సామ్‌కీ, రాజ్‌కీ మధ్య దాదాపు 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. రాజ్ 1975లో పుట్టగా, సామ్ 1987లో పుట్టారు. సామ్ ప్రస్తుతం సొంత ప్రొడక్షన్ హౌస్‌లో ‘మా ఇంటి బంగారం’ మూవీలో నటిస్తున్నారు. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహించే సినిమాలో సామ్ నాయికగా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఖైదీ2లోనూ నాయికగా సామ్‌ని ఎంపిక చేసినట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే అఫిషియల్‌గా వాటిని కన్‌ఫర్మ్ చేయలేదు సామ్.
ఇవి కూడా చదవండి : Actress : అతడిని నమ్మి ఆ సీన్స్ చేశాను.. కానీ షూట్‌లో.. హీరోయిన్ కామెంట్స్..
ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?




