- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress In This Photo, She Is Heroine Anupama Parameswaran
Actress : ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. వరుస హిట్లతో జోష్ మీదున్న హీరోయిన్..
మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ కెరీర్ మొదటి సంవత్సరంలో ఒకే ఒక్క సినిమాలో నటించింది. మొదట్లో ఆమె నటనపై విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదుంది. కేవలం ఒక సంవత్సరంలో ఏడు సినిమాల్లో నటించింది. ఇప్పటికే ఆరు సినిమాలు విడుదలయ్యాయి. మరొకటి డిసెంబర్‌లో విడుదల కానుంది.
Updated on: Dec 01, 2025 | 1:25 PM

చాలా మంది నటీమణులు ఒకే సినిమాలో అవకాశం కోసం ఇబ్బంది పడుతుంటే, ఒక హీరోయిన్ మాత్రం ఒకే సంవత్సరంలో ఏడు సినిమాల్లో నటించి రికార్డు సృష్టించింది. మొదట్లో అవకాశాలు తక్కువగా ఉన్న ఆమె ఇప్పుడు హిట్లతో దూసుకుపోతుంది. ఆమె ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్. "ప్రేమమ్" సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. కేరళలోని త్రిసూర్ కు చెందిన అనుపమ, 19 సంవత్సరాల వయసులో 2015లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

"ప్రేమమ్" చిత్రంలో మేరీ పాత్ర చిన్నదే అయినప్పటీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం ఆమెకు కొత్త అవకాశాలను అందించింది. ఆమె ధనుష్ సరసన "కోడి" చిత్రంలో నటించింది. అలాగే తెలుగులో అఆ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో వరుస సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది మాత్రమే అనుపమ ఏడు చిత్రాల్లో నటించింది. వీటిలో తమిళ చిత్రాలు "డ్రాగన్" , "బైసన్" మంచి హిట్టయ్యాయి. మలయాళంలో "ది పెట్ డిటెక్టివ్" ,"జానకి" చిత్రాల్లో నటించింది.

తెలుగులో "కిష్కేంద్రపురి","పరదా" వంటి ఆరు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సంవత్సరం నటించిన ఏడవ చిత్రం "లాక్‌డౌన్" డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ ఏడాది చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అనుపమ.




