- Telugu News Photo Gallery Cinema photos Know Samantha and Raj Nidimoru Age Difference as they got married
Samantha-Raj Nidimoru: మూడుముళ్ల సాక్షిగా.. సమంత, రాజ్ నిడమోరు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?
మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత. ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్ రాజ్‌తో ఇవాళ ఉదయం వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కోయంబత్తూర్‌లోని లింగ భైరవి ఆలయంలో ఇద్దరి వివాహం జరిగింది. పెళ్లి సామ్ ఎరుపు రంగు చీర ధరించినట్లు తెలుస్తోంది. సాయంత్రం సమంత-రాజ్ వివాహంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఇదే.
Updated on: Dec 01, 2025 | 1:42 PM

సమంత - రాజ్ పెళ్లితో ఒక్కటయ్యారు. సోమవారం అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల సాక్షిగా ఒక్కటయ్యారు. పెళ్లి గురించి ఇటు సమంత నుంచి, అటు రాజ్ నిడిమోరుగా నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సన్నిహితులైతే దీన్ని కన్ఫామ్ చేశారు. ఫ్యామిలీమేన్ సీరీస్ చేసినప్పటి నుంచీ సామ్‌కీ, రాజ్ నిడిమోరుకి పరిచయం ఉంది.

'ఏమాయ చేసావె' మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సమంత. - ఆ సినిమా హీరో నాగచైతన్యను 2017లో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా హిందూ, క్రైస్టవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. అయితే, పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు 2021లో ప్రకటించింది ఈ జంట.

టాలీవుడ్ అందమైన జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో సంచలన వార్త. ఎందుకు విడిపోయారనే విశ్లేషణలు ప్రముఖంగా జరిగాయి. విడాకుల తర్వాత సమంత కెరీర్ మీద ఫోకస్ చేశారు. అయితే, యశోద సినిమా చేస్తున్న సమయంలో ఆమె మయోసైటిస్‌కి గురయ్యారు. అప్పటికప్పుడు నీరసపడిపోతున్నానంటూ మయోసైటిస్ గురించి అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఆమెకు రాజ్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. రాజ్ - సామ్ రిలేషన్ షిప్ గురించి రకరకాల వార్తలు మొదలయ్యాయి. సామ్ విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది రాజ్ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పడం కూడా అప్పట్లో వార్తల్లో నలిగింది. చెన్నై పికిల్ బాల్ టీమ్‌కి వీరిద్దరూ కో ఓనర్స్ గా వ్యవహరిస్తున్నారు.

సామ్‌కీ, రాజ్‌కీ మధ్య దాదాపు 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. రాజ్ 1975లో పుట్టగా, సామ్ 1987లో పుట్టారు. రాజ్ నిడిమోరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. డైరక్టర్‌గా, స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. డీకేతో కలిసి రాజ్ డీకేగా ప్రాజెక్టులు చేస్తున్నారు.




