చీరలో స్టైలిష్ లుక్‌లో.. నిహారిక అందమే అందం..
అందాల ముద్దుగుమ్మ, మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ప్రస్తుతం ఈ అమ్మడు వరసగా సినిమాలు నిర్మిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఏ కాస్త సమయం దొరికినా సరే ఫొటోలకు ఫోజులిస్తూ తన క్యూట్ నెస్‌తో చంపేస్తుంటుంది.
Updated on: Dec 01, 2025 | 5:34 PM

మెగా డాటర్ నిహారిక గురించి ఎంత చెప్పినా తక్కువే. యాంకర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ, ఒక మనసు సినిమాలో హీరోయిన్‌గా చేసి తన నటనతో అందిరినీ ఆకట్టుకుంది, అందులో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అంతలా పాత్రలో ఒదిగిపోయి నటించింది ఈ చిన్నది.

ఇక ఈ మూవీ తర్వాత కొన్ని రోజులకే నిహారిక చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. కానీ ఇది ఎక్కువ కాలం నిలువలేకపోయింది. వివాహం చేసుకున్న చాలా కొద్ది రోజుల్లోనే ఈ అమ్మడు డివోర్స్ తీసుకొని సింగిల్‌గా లైఫ్ లీడ్ చేస్తుంది.

ఇక విడాకుల తర్వాత ఈ బ్యూటీ ఫోకస్ మొత్తం కెరీర్ పైనే పెట్టిందనడంలో అతిశయోక్తి లేదు. వరసగా సినిమాలు నిర్మిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది. సొంతంగా పింక్ ఎలిఫెంటా అనే నిర్మాణ సంస్థ నిర్మించి, ఈమె ప్రొడక్షన్‌లో కమిటీ కుర్రవాళ్లు, అనే సినిమా నిర్మించి సక్సెస్ అందుకుంది.

ఇక ఈ బ్యూటీ ఛాన్స్ దొరికినప్పుడళ్లా , తన క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీకటిలో వెలుగుల మధ్య చీరలో అందంగా ఉన్న ఫొటోలు షేర్ చేసింది.

ఉల్లిపొరలాంటి చీరలో తన అందాలను ఎరగా వేస్తూ కుర్రకారును మాయ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధిచిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



