Samantha: మరోసారి హిట్ కాంబో రిపీట్.. ఆ స్టార్ హీరో సరసన సమంత ?..
టాలీవుడ్ అగ్ర కథానాయికలలో ఒకరైన సమంత తిరిగి తన కెరీర్ పై దృష్టి పెట్టింది. అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న
టాలీవుడ్ అగ్ర కథానాయికలలో ఒకరైన సమంత తిరిగి తన కెరీర్ పై దృష్టి పెట్టింది. అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సామ్ సినిమాల్లో కొనసాగింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలను ప్రాధాన్యత ఇస్తూ.. తన నటనకు ప్రశంసలు అందుకుంది సామ్. అయితే కారణాలేంటో తెలియదు కానీ.. నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా గడిపిన ఈ జంట ఈ ఏడాది విడాకులు తీసుకుని తమ అభిమానులకు షాకిచ్చారు. అయితే విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే కారణాలు ఈ జంట బయటపెట్టలేదు. దీంతో సమంత గురించి సోషల్ మీడియాలో వివిధ రకాల రూమర్స్ వచ్చాయి. దీంతో తనకు సమయం ఇవ్వాలని.. అలా కాదంటూ క్లారిటీ ఇచ్చింది సామ్. అయినా సమంత మీద మాత్రం ఫేక్ న్యూస్ ఆగలేదు. దీంతో ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలలో మోటివేషనల్ కోట్స్ పెడుతూ.. తన పరిస్థితి వివరించే ప్రయత్నం చేస్తుంది సామ్.
ఇదిలా ఉంటే.. సమంత తిరిగి సినిమాల్లో బీజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు తన వరకు వచ్చిన ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట సామ్. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టింది సామ్. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. స్పెషల్ సాంగ్‌లో కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది సమంత. అలాగే ప్రస్తుతం సామ్ ప్రధాన పాత్రలో యశోద సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
ఇక తాజా సమాచారం ప్రకారం సమంత మరోసారి ఎన్టీఆర్ సరసన నటించనుందట. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తారక్.. ఈ మూవీ విడుదల అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో తారక్ సరసన సమంతను హీరోయిన్గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్. సమంత.. తారక్ కాంబోలో ఇప్పటివరకు వచ్చిన బృందావనం, రభస, రామయ్య వస్తావయ్యా, జనతా గ్యారేజ్ చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రీపిట్ కాబోతండడంతో తారక్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
Also Read: Ram Gopal Varma: ఇదేంది సామీ.. కేక్‌ను ఇలా కట్ చేస్తారా.. వర్మ రచ్చ మాములుగా లేదుగా..